March 25, 202509:48:41 AM

Gangotri: ‘గంగోత్రి’ సినిమాకు ముందు ఇంత జరిగిందా… ఆ ముగ్గురూ ఓకే అనుంటే..!

Interesting Story Behind Gangotri Movie Making1

అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇప్పుడు అంటే ఐకాన్‌ స్టార్‌, అంతకుముందు స్టైలిష్‌ స్టార్‌. ఇవన్నీ ఆయన అయ్యాడంటే దానికి కారణం ‘గంగోత్రి’ (Gangotri). దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) వందో సినిమాగా తెరకెక్కిన ఆ చిత్రంతోనే బన్నీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే తొలుత రాఘవేంద్రరావు అనుకున్న సినిమా అనుకున్నట్లుగా తెరకెక్కి ఉంటే బన్నీ అరంగేట్రం మరో సినిమాతో అయ్యేది. ఎందుకంటే ‘గంగోత్రి’ ప్రాజెక్ట్‌ నిజానికి చిరంజీవి నటించాల్సిన భారీ మల్టీ స్టారర్. రాఘవేంద్రరావు తన వందో సినిమా కోసం రెడీ అవుతున్న రోజులవి.

Gangotri

‘నరసింహ నాయుడు’ (Narasimha Naidu), ‘ఇంద్ర’ (Indra) సినిమాల రచయిత చిన్నికృష్ణ (Chinni Krishna) ఓ కథ రెడీ చేశారు. అదే ‘త్రివేణి సంగమం’. చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh) హీరోలుగా అశ్వనీదత్ (C. Aswani Dutt) ఈ సినిమాను నిర్మించాలనేది ప్లాన్‌. సినిమా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆగిపోయారు. దీంతో ‘గంగోత్రి’ లైన్‌లోకి వచ్చింది. దివంగత ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) చెల్లెలు అదితి అగర్వాల్‌ను (Aditi Agarwal) హీరోయిన్‌గా తీసుకొని ‘గంగోత్రి’ సినిమాను ప్రారంభించారు.

హీరో హీరోయిన్లకు తొలి సినిమా కావడంతో మ్యూజికల్ మ్యాజిక్‌గా సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కీరవాణి (M. M. Keeravani) సంగీతంతోనే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమాలో హీరో లుక్స్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, ఆ విమర్శలను ఛాలెంజింగ్‌గా తీసుకున్న అల్లు అర్జున్‌ స్టైలిష్‌ స్టార్‌గా మారాడు. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ కూడా అయ్యాడు. ఒకవేళ దర్శకేంద్రుడి వందో సినిమాగా తొలుత అనుకున్న ‘త్రివేణి సంగమం’ వచ్చి ఉంటే..

బన్నీ ఇంకే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యేవాడో. ఆ తర్వాత వచ్చిన సినిమాల బట్టి చూస్తే కచ్చితంగా ‘ఆర్య’ (Aarya) సినిమాతోనే ఎంట్రీ ఇచ్చేవాడు.ఇక బన్నీ సంగతి చూస్తే ‘పుష్ప’రాజ్‌గా మారి భారీ విజయం, నేషనల్‌ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు నాలుగో తేదీ రాత్రి ‘పుష్ప’రాజ్‌ రెండోసారి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే బన్నీ గురించి పాత విషయాలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో నుండి ఈ తొలి సినిమా టాపిక్‌ మీ కోసం తీసుకొచ్చాం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.