March 23, 202506:02:15 AM

Jr NTR: మొత్తానికి దిగొచ్చిన ఎన్టీఆర్.. అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు!

Jr NTR Team Helps His Fan Koushik (1)

తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  వీరాభిమాని కౌశిక్ .. క్యాన్సర్‌ భారిన పడ్డ సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’  (Devara)  సినిమా చూడటం అనేది తన ఆఖరి కోరిక అంటూ అతను చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అతని ఫ్రెండ్స్ ఎన్టీఆర్ వరకు తీసుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ స్వయంగా కౌశిక్ కి వీడియో కాల్ చేసి మాట్లాడి అతనికి ధైర్యం చెప్పడం మాత్రమే కాకుండా తనకి అవసరమైన సాయాన్ని చేస్తానని, ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని..

Jr NTR

Jr NTR Team Helps His Fan Koushik (1)

అతని ఫ్యామిలీకి భరోసా ఇచ్చాడు. తర్వాత అతన్ని చెన్నైలోకి అపోలో హాస్పిటల్లో చేర్పించి కీమో చేయించారు. ఈ క్రమంలో అతనికి మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి అని ఆమె తల్లి చెప్పింది. దీంతో ‘హాస్పిటల్ ఖర్చులు కూడా ఎక్కువయ్యాయని,ఎన్టీఆర్ అభిమానుల నుండి మాకు రూ.2.5 లక్షలు,సి.ఎం.ఆర్.ఎఫ్ నుండి రూ.11 లక్షలు, టిటిడి నుండి రూ.40 లక్షలు వరకు సాయం అందిందని’ కౌశిక్ తల్లి సరస్వతి చెప్పింది.

Jr NTR Fan Koushik Mother Sensational Allegations On NTR (1)

తర్వాత డిశ్చార్జ్ కొరకు మరో రూ.20 లక్షలు చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యం వారిపై ఒత్తిడి చేస్తుందని, ఈ క్రమంలో ఎన్టీఆర్ అకౌంటెంట్ ని సంప్రదించినా.. వాళ్ళు పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి చెప్పుకొచ్చారు. ఆమె మీడియా ముందుకు వచ్చి తన అసహనాన్ని తెలుపడంతో.. ఎన్టీఆర్ టీం వెంటనే స్పందించింది. వెంటనే కౌశిక్ హాస్పిటల్ బిల్లులు చెల్లించి.. అతన్ని డిశ్చార్జ్ చేయించడం కూడా జరిగింది.

మీడియా ముందుకు కౌశిక్ తల్లి వచ్చి ఆమె ఆవేదన తెలిపితేనే కానీ.. ఎన్టీఆర్ టీం రెస్పాండ్ కాలేదు, ఎన్టీఆర్ కి ఇచ్చిన మాట గుర్తుకు రాలేదు అని కొందరు మాటలు వదులుతున్నారు. ఏదేమైనా కౌశిక్ కి న్యాయం జరిగింది కాబట్టి.. ఆ రకంగా కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. ఈ రకంగా మీడియా గొప్పతనం, సోషల్ మీడియా వల్ల ఉండే ప్రయోజనం కూడా అందరికీ గుర్తు చేసినట్లు అయ్యింది. త్వరలోనే కౌశిక్ పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.