March 18, 202503:13:25 AM

Mahesh Babu, Allu Arjun: మహేష్, బన్నీ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పరీక్షే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ..ల క్రేజ్ వేరు. వీళ్ళ సినిమాలు స్లో పాయిజన్ లాంటివి. నెగిటివ్ టాక్ వచ్చినా.. వీళ్ళ సినిమాలకి మంచి రెవెన్యూస్ వస్తాయి. దానికి కారణం ఈ ఇద్దరి హీరోలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. అందుకే వీళ్ళ రీజనల్ మూవీస్ కూడా సునాయాసంగా వంద కోట్ల మార్క్ దాటేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళ మార్కెట్ వాల్యూ ప్రకారం అల్లు అర్జున్ కంటే మహేష్ బాబు ముందుంటాడు.

Mahesh Babu, Allu Arjun:

అదే హిట్ పర్సెంటేజ్ బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ ముందుంటాడు. ఈ ఏడాది అంటే 2024 ఆరంభంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తో సందడి చేశాడు. ఎండింగ్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  తో సందడి చేస్తున్నాడు. మరోపక్క అల్లు అర్జున్ పాన్ ఇండియా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబు ఇప్పటివరకు రీజనల్ మూవీస్ మాత్రమే చేస్తూ వచ్చాడు. అయితే మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకి రాజమౌళి చాలా టైం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులకే ఇంత టైం తీసుకుంటే.. సినిమాకి ఎంత టైం తీసుకుంటాడో అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. దీంతో 2028 వరకు మహేష్ బాబు సినిమా రాకపోవచ్చు అని ఫ్యాన్స్ ఫిక్సయిపోతున్నారు.

మరోపక్క అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ అని తెలుస్తుంది. దీని ప్రీ ప్రొడక్షన్ పనులకి కూడా త్రివిక్రమ్ ఏడాది వరకు టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాకు రూ.600 కోట్లు బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇది కంప్లీట్ అవ్వడానికి కూడా 3 ఏళ్ళు టైం పెట్టొచ్చని అంటున్నారు. సో 2028 వరకు మహేష్ బాబు, అల్లు అర్జున్..లు స్క్రీన్ పై కనిపించకపోవచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.