March 29, 202507:12:24 AM

Manoj Bajpayee: హద్దు దాటేసిన మనోజ్ బాజ్ పేయి.. వెబ్ సిరీస్ కోసం నగ్నంగా!

రియలిస్టిక్ సినిమాలు చేయడంలో మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) శైలి వేరు. 40 ఏళ్ల వయసులో ఆయన గే లెక్చరర్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదే విధంగా మరో సినిమాలో తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా నటించి మన్ననలు అందుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో మనోజ్ కొన్ని శృంగార సన్నివేశాల్లోనూ నటించాడు. అయితే.. ఆయన నటించిన తాజా వెబ్ ఫిలిం “డెస్పాచ్”లో మాత్రం బోర్డర్ దాటేశాడు. మొన్నటివరకు కేవలం మొరటు Sruగార సన్నివేశాల్లో మాత్రమే కనిపించిన మనోజ్ బాజ్ పేయి, ఈ సిరీస్ లో ఏకంగా నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చాడు.

Manoj Bajpayee

ముఖ్యంగా ఈ సిరీస్ లోని Sruగార సన్నివేశాలు స్పానిష్ చిత్రం “ది టైగర్” నుండి స్ఫూర్తి పొందినవి కావడంతో రోమాంచితంగా ఉన్నాయి. ఈ సీన్స్ ను ఊహించనివారు సిరీస్ చూసి షాక్ అవుతుండగా.. ఈ సీన్స్ ను సోషల్ మీడియాలో చూసిన జనాలు మనోజ్ ఏంటి మరీ ఇలాంటి సీన్స్ చేశాడు అని షాక్ అవుతున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మంచి మంచి సినిమాలు చేసి నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న మనోజ్ కి ఎంత తనను తాను మరో కోణంలో చూసుకోవాలి అనిపించినప్పటికీ.. “డెస్పాచ్” లాంటి సినిమాలు చేయడం అనేది అందరూ కాస్త ఇబ్బందికరమే. అసలే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత మనోజ్ ఓటీటీ ఆడియన్స్ కి ఫేవరెట్ అయిపోయాడు.

మరి ఇప్పుడు అదే ఓటీటీలో జీ5 యాప్ లో స్ట్రీమ్ అవుతున్న “డెస్పాచ్”ను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఈ సిరీస్ లో మనోజ్ తోపాటు Sruర సన్నివేశాల్లో జీవించేసిన అర్చిత అగర్వాల్ కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.