
ప్రశాంత్ వర్మ (Prasanth Varma) .. ‘హనుమాన్’ తో (Hanu Man) పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగాడు. దీనికి ముందు ప్రశాంత్ వర్మ చేసిన ‘అ!’ (Awe) ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) సినిమాలు కూడా డీసెంట్ సక్సెస్ అనిపించుకున్నాయి. సీనియర్ హీరో రాజశేఖర్ తో (Rajasekhar) చేసిన ‘కల్కి’ మాత్రం ప్లాప్ అయ్యింది.సక్సెస్ రేట్ ప్రకారం చూసుకుంటే ప్రశాంత్ వర్మ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. కానీ ఇతని ఆటిట్యూడ్ తో మంచి మంచి ఛాన్సులు మిస్ చేసుకుంటున్నాడు అని ఇండస్ట్రీ టాక్. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ నుండి ‘జై హనుమాన్’ సినిమా వస్తుంది అని అంతా భావించారు.
Mokshagna, Prasanth Varma
కానీ మధ్యలో మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేశాడు. అది ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. మరోపక్క రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా సెట్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అది నిజమే..కానీ ‘రణ్వీర్ సింగ్ ని లుక్ టెస్ట్ కి పిలిచి.. కేవలం చేతులు, పాదాలు, కళ్ళు ఫోటోలు తీసి మిగిలింది అంతా సీజీలో చేసి ఫస్ట్ లుక్ ఇస్తా’ అంటూ ప్రశాంత్ వర్మ ఆ స్టార్ తో అన్నాడట. దీంతో ఒకసారి రణ్వీర్ సింగ్ సినాప్సిస్ అడగ్గా.. ‘అవసరం లేదు మీరు డైరెక్ట్ గా షూటింగ్ కి వచ్చేయొచ్చు.
మీకు హిట్ సినిమా ఇచ్చే బాధ్యత నాది’ అంటూ ప్రశాంత్ వర్మ చెప్పాడట. ఇది రణ్వీర్ సింగ్ కి Ranveer Singh నచ్చలేదు. దీంతో అతను అక్కడ నుండి అసంతృప్తితో వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. దీంతో తర్వాత నిర్మాతలు ఫోన్లు చేయడం, రణ్వీర్ ‘ప్రాజెక్టు చేయను’ అని చెప్పడంతో ‘నిర్మాతలు బతిమిలాడితే కన్విన్స్ అయ్యి కొన్నాళ్ల తర్వాత వేరే దర్శకుడితో చేస్తాను’ అని చెప్పడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలో కూడా అదే జరిగింది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) కొడుకు మోక్షజ్ఞని (Nandamuri Mokshagnya) హీరోగా లాంచ్ చేసే బాధ్యత ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలకృష్ణ.
రణ్వీర్ సింగ్ కి చేసినట్టే.. పాదాలు, కళ్ళు, చేతులు ఫోటోలు తీసి సీజీ వాడి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వదిలాడు. అయితే ఇటీవల ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దానికి కథ అందించింది ప్రశాంత్ వర్మ. అందువల్ల మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అడిగారట బాలయ్య, సహా నిర్మాత తేజస్విని. అయితే ప్రశాంత్ వర్మ వద్ద కథ లేదు. ‘నన్ను నమ్మండి.. హిట్టిచ్చే బాధ్యత నాది’ అని ప్రశాంత్ వర్మ చెప్పాడట.
అయినా బాలయ్యకి కోపం వచ్చింది. వాస్తవానికి బాలయ్య.. మోక్షజ్ఞ కోసం ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే కథను రెడీ చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మని ఆ కథకి డైరెక్షన్ చేయమన్నాడు. అయితే ఇందుకు ప్రశాంత్ వర్మ ఒప్పుకోలేదు. ఒక లైన్ చెప్పి ఒప్పించాడు. కానీ కథ ఇంకా రెడీ చేసుకోలేదు అని తెలుస్తుంది. అందుకే బాలయ్యకి కోపం వచ్చి ప్రశాంత్ వర్మని పక్కన పెట్టడం జరిగిందట.