March 20, 202507:44:18 PM

Mokshagnya: మోక్షజ్ఞ ప్రాజెక్టు ఇంకా స్టార్ట్ కాలేదా.. మళ్ళీ ఏమైంది?

Mokshagnya

నందమూరి బాలకృష్ణ (Balakrishna)  వారసుడిగా మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ  (Prasanth Varma)  దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కనుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. డిసెంబర్ 5న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని పేర్కొనడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు, దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది.

Mokshagnya

Mokshagnya

క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో మరో సూపర్ హీరో కాన్సెప్ట్‌గా ఈ చిత్రాన్ని తీసుకురావాలని ప్లాన్ చేసినా, స్క్రిప్ట్‌లో ఇంకా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందట. ఈ కారణంగా చిత్ర ప్రారంభం వాయిదా పడినట్లు సమాచారం. ఇంకా కొన్ని వర్గాల టాక్ ప్రకారం, మోక్షజ్ఞ ఇంకా కెమెరా ముందుకు రావడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరని, మెంటల్ ప్రిపరేషన్ కోసం కొంత సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

బాలకృష్ణ తనయుడు కోసం ప్రతి అంశాన్ని మెరుగ్గా చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల చిత్రానికి అదనపు అంచనాలు పెరుగుతాయా లేదా అనేది చూడాలి. అదేవిధంగా, బాలయ్య తన కొడుకు తొలి చిత్రానికి సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారు. బాలయ్య, సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు ప్రకటించారు.

“హనుమాన్” (Hanuman) తరహాలో, ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో మాసివ్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే, ఇలాంటి సడెన్ బ్రేక్ కారణంగా అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. అదీగాక, మోక్షజ్ఞ రెండో చిత్రంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వెంకీ అట్లూరి (Venky Atluri)   దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మరో చిత్రం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.