March 16, 202511:32:32 AM

Nithiin: ‘రాబిన్ హుడ్’ వాయిదా.. నితిన్ కి ఇష్టం లేదా..?!

నితిన్ (Nithiin)  వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. 2020 లో వచ్చిన ‘భీష్మ’ (Bheeshma)  తర్వాత నితిన్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘రంగ్ దే’ (Rang De) యావరేజ్ గా ఆడినా ‘చెక్’ (Check) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా’  (Extra Ordinary Man) వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ‘మాస్ట్రో’ (Maestro) ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యింది. సో నితిన్ ఓ హిట్టు కొట్టడం అనేది ఇప్పుడు అత్యవసరం అయ్యింది. ఎందుకంటే.. బాక్సాఫీస్ వద్ద అతని సినిమాలు కూడా నిలబడని పరిస్థితి ఏర్పడింది.

Nithiin

మిగతా హీరోలతో పోలిస్తే రేసులో వెనుకబడ్డాడు. అందుకే ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ (Robinhood) పై ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు. తనకు ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల (Venky Kudumula).. ఈ చిత్రానికి దర్శకుడు.’మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. కానీ ఆ టైంకి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని ఫిల్మీ ఫోకస్ ఇటీవల ఎక్స్ క్లూజివ్ గా ప్రకటించింది.

Nithiin

ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవ్వడం వల్ల.. ఈ సినిమా వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే హీరో నితిన్, అతని తండ్రి..ప్రముఖ నిర్మాత అయినటువంటి సుధాకర్ రెడ్డి.. ‘రాబిన్ హుడ్’ పోస్ట్ పోన్ కి ఒప్పుకోవడం లేదట.

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) మ్యానియా ఉండగా, ‘రాబిన్ హుడ్’ ని ప్రేక్షకులు పట్టించుకోరేమో అనే డౌట్ నిర్మాతల్లో ఉందట. అయితే నితిన్, సుధాకర్ రెడ్డి మాత్రం ’25 క్రిస్మస్ హాలిడే ఉంది, ఆ తర్వాత లాంగ్ వీకెండ్ తో పాటు న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసి వస్తుంది’ అని చెబుతున్నారట. ప్రస్తుతం ఇరువురి మధ్య చర్చ నడుస్తోంది. మరి ఎవరి డెసిషన్ ఫైనల్ అవుతుందో చూడాలి..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.