March 21, 202502:45:38 AM

Pawan Kalyan, Ram Charan: చరణ్ కోసం పవర్ స్టార్.. అభిమానులకు కిక్కిచ్చేలా!

Pawan Kalyan to Attend Ram Charan's Game Changer Event (1)

మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ (Ram Charan)  చిన్నప్పటి నుంచే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ఎక్కువ సమయం గడిపాడు. ఈ అనుబంధం ఇప్పటికీ ఫ్యాన్స్ కి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీ అభిమానులకు ఇప్పుడు ఈ బాబాయ్ అబ్బాయ్ కాంబో మరింత ఆనందాన్ని తెచ్చేలా ఉంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన “గేమ్ ఛేంజర్” (Game Changer)  చిత్రం జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది.

Pawan Kalyan, Ram Charan:

శంకర్ (Shankar)  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అమెరికాలోని డల్లాస్ లో జరగబోయే “గేమ్ ఛేంజర్” ప్రమోషనల్ ఈవెంట్లకు చరణ్ చేరుకున్నారు.

Political Writer's Touch in Game Changer Script (1)

అలాగే, చెన్నైలో మరో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కి మజా ఇవ్వడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెగా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చరణ్ కోసం ఈ ఈవెంట్‌లో కనిపించబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. “గేమ్ ఛేంజర్” చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా, మరొకటిలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు.

కియారా అద్వానీ (Kiara Advani)  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా, అంజలి (Anjali), ఎస్ జే సూర్య (SJ Suryah), శ్రీకాంత్ (Srikanth) వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు (Dil Raju)  నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు పవన్-చరణ్ కాంబోతో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్, గేమ్ ఛేంజర్‌పై మరింత బజ్‌ను క్రియేట్ చేయడం ఖాయం.

పాన్ ఇండియా మార్కెట్ లో మనోళ్ళ ఊచకోత!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.