పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి (Prabhas) గాయమైనట్లు ఆయన టీం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) చిత్రం త్వరలో జపాన్లో విడుదల కాబోతుంది. దీంతో అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), నిర్మాతలైన స్వప్న(Swapna Dutt) , ప్రియాంక దత్(Priyanka Dutt)..లు ప్లాన్ చేశారు. జపాన్లో కూడా ప్రభాస్ కి వీరాభిమానులు ఉన్నారు. ‘సాహో’ (Saaho) ‘సలార్’ (Salaar) సినిమాలు జపాన్లో బాగా ఆడాయి. అందువల్ల ‘కల్కి’ పై అక్కడ మంచి అంచనాలు ఉన్నాయి.
Prabhas Injured:
ఆ సినిమా కాన్సెప్ట్ కూడా వాళ్ళకి నచ్చేదే. అందుకే ప్రభాస్ ని కూడా జపాన్ తీసుకెళ్లి సినిమాని బాగా ప్రమోట్ చేద్దాం అని దర్శకనిర్మాతలు భావించారు. కానీ వీటికి ప్రభాస్ హాజరు కావడం లేదు. ఇందుకు కారణాన్ని కూడా ప్రభాస్ టీం వెల్లడించింది. వారి సమాచారం ప్రకారం.. ‘ప్రభాస్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో భాగంగా గాయపడ్డాడట. ఆ ఇంజ్యురీ వల్ల.. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని..’ వారు చెబుతున్నారు.
అలాగే ‘ప్రస్తుతానికి సినిమా చూసి ఎంజాయ్ చేయండి.. త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ అంటూ ప్రభాస్ జపాన్ అభిమానులకి సందేశం పంపినట్టు కూడా వారు తెలిపారు.ఇక ‘కల్కి 2898 ad’ సినిమా ఈ ఏడాది అనగా 2024 జూన్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.