March 28, 202502:47:13 PM

Vijay Sethupathi: చరణ్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి.. ఇదిగో క్లారిటీ!

‘సైరా నరసింహా రెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సినిమాలో చిన్న పాత్రలో మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతిని (Vijay Sethupathi) చూశాక తెలుగులో నటిస్తే చూడాలని ఉంది అంటూ చాలా ఏళ్లు అతని టాలీవుడ్‌ అభిమానులు వెయిట్‌ చేశారు. అందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో తెలుగులో ఫుల్‌ లెంగ్త్‌ పాత్ర చేసి వావ్‌ అనిపించారు. ఆ తర్వాత నుండి మరో సినిమా కావాలి అనే కోరిక మొదలైంది. దీనికి మళ్లీ ఎదురుచూపులు మొదలయ్యాయి. తాజాగా విజయ్‌ మాటలు వింటుంటే.. ఆ వెయిటింగ్‌ ఇంకొన్నాళ్లు ఉండేలా ఉంది.

Vijay Sethupathi

‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌ సేతుపతి ఉంటారు అని వార్తలొచ్చాయి. గత కొన్ని రోజులుగా ఈ మాటలు వినిపిస్తున్నా, రెండు వైపుల నుండి ఖండన కానీ, సమాచారం కానీ రాలేదు. దీంతో ఉన్నారేమో అని అనుకున్నారంతా. కానీ అలాంటి అవకాశం లేదు అని విజయ్‌ సేతుపతి క్లారిటీ ఇచ్చేశాడు. ‘విడుదల 2’ సినిమా ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ చరణ్‌ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు.

రామ్‌చరణ్‌ (Ram Charan)  – బుచ్చిబాబు  (Buchi Babu Sana) సినిమాలో నటించడానిఇకి తనకు సమయం లేదని చెప్పిన విజయ్‌ సేతుపతి.. నేరుగా తెలుగు సినిమాల్లో హీరోగా నటించడానికి కథలు వింటున్నానని చెప్పాడు. తెలుగు పరిశ్రమ నుండి ఏదైనా స్టోరీ బాగుంటే, హీరో పాత్ర నచ్చడం లేదని చెప్పాడు. త్వరలోనే ఓ సినిమా సెట్‌ అయ్యే అవకాశాలున్నాయని, ఆ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాడు విజయ్‌.

గతేడాది విడుదలైన ‘విడుదల 1’కి కొనసాగింపుగా ‘విడుదల 2’ (Vidudala Part 2) వస్తోంది. వెట్రిమారన్‌ (Vetrimaaran) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తొలి పార్టుకు మించి రస్టిక్‌ అండ్‌ రా గా ఈ సినిమా ఉంటుంది అని ప్రచారం చిత్రాలు చూస్తే తెలుస్తోంది. ఇందులో సూరి (Soori Muthusamy) , విజయ్‌ సేతుపతి, మంజుప వారియర్‌ (Manju Warrier) , అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) తదితరులు నటించారు.

అప్పుడు తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.