March 20, 202511:57:04 PM

Prashanth Neel: ఎన్టీఆర్‌ సినిమా జోనర్‌.. క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్‌ నీల్‌.. ఏం చెప్పారంటే?

Prashanth Neel Gives Clarity On Jr NTR Project Genre (1)

 

తారక్‌ (Jr NTR) – ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కానీ రీసెంట్‌గా ఓ పుకారు బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ ఊహించని ప్రయోగం చేస్తారు అని అర్థమైంది. కానీ ఆ ఆలోచనలు, ఆశలు, పుకార్ల మీద దర్శకుడు నీళ్లు చల్లారు. మీరు అనుకుంటున్నట్లు కాదు కానీ.. సినిమా అయితే కొత్తగా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్‌ నీల్‌. ‘దేవర 1’ (Devara)  సినిమా విజయాన్ని ఆస్వాదించి ‘వార్ 2’ సినిమా పనులు శరవేగంగా పూర్తి చేస్తున్న తారక్‌..

Prashanth Neel

Prashanth Neel Gives Clarity On Jr NTR Project Genre (1)

వచ్చే ఏడాది మార్చి నుండి ప్రశాంత్‌ నీల్‌ సినిమా స్టార్ట్‌ చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే ‘సలార్‌ 2’ సెట్స్‌ మీద ఉండగా ఈ సినిమా స్టార్ట్‌ చేస్తారా అనేది ఓ ప్రశ్న. దానికి ఆన్సర్‌ రావాల్సి ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ టీమ్‌ మాత్రం ఈ సినిమాను 2026 సంక్రాంతికి తీసుకొచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘సలార్ 1’ (Salaar) ఫస్ట్‌ యానివర్సరీ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది.

ఈ క్రమంలోనే పుకార్లు వస్తున్నట్లు ఈ సినిమా మైథలాజికల్ కథ కాదని, పీరియాడిక్ సెటప్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే ‘కేజీయఫ్‌’ (KGF) సినిమాలు, ‘సలార్’ సినిమాల తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్‌తో యాక్షన్ డ్రామాని చూడొచ్చు. తన మనసులో మైథలాజికల్‌ కథ ఒకటి ఉన్నా.. అది ఈ సినిమాకు ఇవ్వలేదని, ఆ సినిమా ఎలాగైనా చేస్తాను అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు. తారక్‌ సినిమా మాత్రం తన గత చిత్రాల తరహాలోనే ఉంటుంది అన్నారు.

మరి గత సినిమాలకు దీనికి లింక్‌ పెట్టి ఏమన్నా యూనివర్స్‌ చేస్తారా? లేక దేని పని దానిదే అనేలా వదిలేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth)  పేరును దాదాపు ఫిక్స్‌ చేశారని సమాచారం. త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారు అని చెబుతున్నారు.

సీఎం రేవంత్ తో చర్చలకు సిద్ధమైన టాలీవుడ్.. నాగవంశీ ఏమన్నారంటే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.