March 21, 202501:40:52 AM

Pushpa3 The Rampage: ‘పుష్ప 3’ లో జగదీష్ పాత్ర ఉండదా?

Pushpa3 The Rampage

అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా సినిమా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అంతకంటే ఎక్కువగా ఇండియా వైడ్ బాగా ప్రమోట్ చేసింది. పాన్ ఇండియా సినిమాకి కావాల్సిన హైప్ ను ‘పుష్ప 2’ కి తెప్పించడంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ సక్సెస్ అయ్యింది. ‘పుష్ప’ (Pushpa)  కూడా నార్త్ లో సూపర్ హిట్ అవ్వడం మైత్రి సంస్థకి బాగా కలిసొచ్చింది.

Pushpa3 The Rampage

Pushpa3 The Rampage

చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఈ సినిమాని నిర్మించారు రవి శంకర్ (Y .Ravi Shankar) , నవీన్ ఎర్నేని (Naveen Yerneni)..లు..! చివరికి ‘పుష్ప’ లో నటించిన ఓ నటుడు జైలుకి వెళ్తే అతన్ని..లక్షలు ఖర్చు చేసి బయటకి తీసుకొచ్చింది. అతను మరెవరో కాదు జగదీష్ (Jagadesh). ‘పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర పోషించి బాగా పాపులర్ అయ్యాడు జగదీష్. ఈ సినిమాతో అతనికి వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ‘పుష్ప’ రైట్ హ్యాండ్ లాంటి రోల్ ఇది.

‘పుష్ప’ కథ కూడా ఇతని వాయిస్ ఓవర్లోనే సాగుతుంది. అయితే తర్వాత ఊహించని విధంగా ఇతను ఓ కేసులో జైలుకి వెళ్ళాడు. సెకండ్ పార్ట్ కి ఇతని అవసరం ఉంది. దర్శకుడు సుకుమార్ కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. అందుకే ఇతన్ని బయటకి తీసుకొచ్చారు.ఇటీవల ‘పుష్ప 3’ (Pushpa3 The Rampage) కూడా అనౌన్స్ చేశారు.

కానీ మూడో భాగంలో జగదీష్ పాత్రని తప్పించడానికి స్క్రిప్ట్..లో మార్పులు కూడా చేసిందట సుకుమార్ అండ్ టీం. ముందుగా ‘పుష్ప 2’ లో అతని పాత్రకి కళ్ళు పోయినట్టు చేశారట. క్లైమాక్స్ లో అతని పాత్ర చనిపోయినట్టు కూడా చేసినట్టు వినికిడి. అతని ప్లేస్లో సత్యని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయట.

‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డుని ‘పుష్ప 2’ బ్రేక్ చేస్తుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.