March 20, 202502:00:28 AM

Rashmika: ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌!

సినిమా విడుదలైన తర్వాత రివ్యూ రాయడం, రావడం సహజం. అయితే శ్రీవల్లి అలియాస్‌ రష్మిక మందన (Rashmika Mandanna) సినిమా వర్కింగ్‌ రివ్యూ రాసేసింది. అవును ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లాంగ్‌ పోస్ట్‌ రూపంలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ‘పుష్ప’ (Pushpa) విడుదలవుతున్న నేపథ్యంలో నేను చాలా ఎమోషనల్‌గా ఉన్నాను. నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది.

Rashmika

ఈ సినిమాతో, సినిమా టీమ్‌తో నేను వ్యక్తిగతంగా బాగా కనెక్ట్‌ అయ్యాను. నా జీవితంలో నన్ను ఇంతగా ప్రభావితం చేసిన సినిమా ఏదీ లేదు. ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రీకరణ సమయంలో నా ఆలోచనలు, భావోద్వేగాలను మీతో షేర్‌ చేసుకోవాలి అనుకుంటున్నాను’’ అని లేఖను స్టార్ట్‌ చేసింద శ్రీవల్లి. ‘‘ఎక్కడి నుండి స్టార్ట్‌ చేయాలబ్బా.. ఆఁ… 2021లో సినిమా చిత్రీకరణ ప్రారంభమై ఉండొచ్చు. కానీ అక్కడికి చాలా రోజుల ముందు, అంటే కొవిడ్‌ సంక్షోభం సమయంలో సినిమా పనులు మేం ప్రారంభించాం.

నాకు చిత్తూరు యాసలో డైలాగులు నేర్పించడానికి మా ఇంటికి ఓ టీమ్‌ వచ్చింది. తొలి రోజు నుండి నేను ఆ యాసలో పర్‌ఫెక్ట్‌ అయ్యేలా చేయడానికే ఆ ప్లాన్‌ చేశారు’’ అని రాసింది రష్మిక. ‘‘పుష్ప’ సినిమాలు చిత్రీకరణై ఐదేళ్లపాటు సాగింది. తొలి రోజుల్లో సుకుమార్‌తో  (Sukumar) ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనుకునే దాన్ని. ఇప్పుడు ఆయనతో బాగా కనెక్ట్‌ అయిపోయాను. అల్లు అర్జున్‌తో (Allu Arjun) మాట్లాడటానికి మొదట్లో భయపడ్డ నేను.. ఆ తర్వాత ఆయన సెట్‌లో ఎక్కడ ఉన్నారో చూసి వెళ్లి మరీ మాట్లాడాను.

ఇక సినిమాటోగ్రాఫర్‌ కూబా గురించి చెప్పాలంటే.. ఆయన తక్కువ మాట్లాడతారు. కానీ ఆయన పనితనం సూపర్‌’’ అని చెప్పుకొచ్చింది రష్మిక. ‘‘మైత్రీ మూవీ మేకర్స్‌తో అయితే తొలి రోజు నుండి, ఆఖరి రోజు వరకు డేట్స్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆ సంస్థ నాకు హోంలా మారింది. ఫహాద్‌ ఫాజిల్‌తో  (Fahadh Faasil)  రెండు రోజులే పని చేశా. ఆయన సినిమాలో మ్యాజిక్‌ చేశారు. సినిమా టీమ్‌ అంతా విజయం కోసం పని చేసింది’’ అని రాసుకొచ్చింది శ్రీవల్లి.

 ‘పుష్ప’ ఈవెంట్లకు రాని ఫహాద్‌ ఫాజిల్‌.. ఆ వాదన కరెక్టేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.