March 27, 202510:10:08 PM

Rashmika: మహేష్‌ సినిమా మరచిపోయిన రష్మిక… నెటిజన్లు ట్రోల్‌ షురూ!

Rashmika Mandanna Says Sorry For Forget Mahesh Babu Movie (1)

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అలాగే చక్కనమ్మ సారీ చెప్పినా అందంగానే ఉంటుంది. ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్‌ ఉందా? అయితే రష్మిక మందన (Rashmika Mandanna) చెప్పిన సారీ చూడండి మీకే తెలుస్తుంది. వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్‌ క్రష్ రష్మికకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె ఓ సినిమా పేరు తప్పుగా చెప్పింది. ఆ విషయంలోనే సారీ కూడా చెప్పింది.

Rashmika

Rashmika Mandanna Says Sorry For Forget Mahesh Babu Movie (1)

తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి (Vijay Devarakonda) రష్మిక మందన వీరాభిమాని అనే విషయం తెలిసిందే. గతంలో చాలా సందర్భాల్లో చెప్పింది కూడా. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా విజయ్‌ ‘గిల్లి’ (Ghilli) అని చెప్పింది. ఆ సినిమా గురించి వివరిస్తూ ఆ సినిమా తెలుగులో మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘పోకిరి’ (Pokiri) సినిమాకు రీమేక్ అని అంది.

ఆ సినిమాలోని ఓ పాట అంటే తనకెంతో ఇష్టమని, ఆ పాటకు ఎన్నోసార్లు స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చేసినట్లు కూడా ఆమె చెప్పింది. తాను స్క్రీన్‌ మీద చూసిన మొదటి హీరో విజయ్‌ అని, ఫస్ట్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) ఆ సినిమా గురించి వివరించింది. ఫ్లోలో చదివితే మీకు కూడా డౌట్‌ రాలేదు అనుకుంటా. ఎందుకంటే ‘గిల్లి’ సినిమాకు ఒరిజినల్‌ వెర్షన్‌ ‘పోకిరి’ కాదు.. ‘ఒక్కడు’ (Okkadu). ఈ పాయింట్‌ పట్టుకుని నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు.

అయితే, విషయం అర్థం చేసుకున్న రష్మిక సారీ చెప్పింది. ఈ మేరకు ఓ పోస్ట్‌కు రష్మిక తెలుగులో రిప్లై పెట్టారు. ‘అవును. సారీ ‘గిల్లి సినిమా’… ‘ఒక్కడు’కు రీమేక్ కదా.. అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా. ‘పోకిరి’ సినిమాను అదే పేరుతో తమిళంలో రీమేక్‌ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్‌ చేసేస్తారు అని కూడా అనుకున్నా. నిజంగా సారీ’ అని రాసుకొచ్చింది రష్మిక.

రికార్డులు జోరులో ‘పుష్ప’రాజ్‌… ఇంకాసేపు థియేటర్లలో కూర్చునేలా!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.