March 20, 202511:17:18 PM

Rishab Shetty: రిషభ్‌ స్కూల్‌ డేస్‌ వింటే మాలాగే అని మీరు అనుకుంటారు.. ఎందుకంటే?

Rishab Shetty Adopts Government School in his Hometown (1)

మొన్న ‘జై హనుమాన్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చిన తర్వాత రిషభ్‌ శెట్టి (Rishab Shetty) లుక్‌ చూస్తే.. భలే అనిపించాడు. ఆ బాడీ, మజిల్స్‌, హెయిర్‌తో సూపర్‌ ఉన్నాడు. మాస్‌ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా కనిపించాడు. అయితే తొలినాళ్లలో రిషభ్‌ ఎలా ఉండేవాడో తెలిస్తే మీరు అస్సలు నమ్మరు. ఆ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తొలినాళ్లలో స్కూల్లో బక్కపలచగా ఎవరైనా కొడితే పడిపోయేలా ఉండేవాడట. రిషభ్‌ శెట్టి ఎలిమెంటరీ స్కూల్‌ డేస్‌లో తనకంటే తక్కువ వయసు ఉన్న పిల్లాడి చేతిలో కూడా దెబ్బలు తిన్నాడట.

Rishab Shetty

చూడటానికి సన్నగా ఉండటం వల్లనేమో దెబ్బలు తినేసేవాడట. దీంతో ఇలా ఉంటే కష్టమని ఎక్సర్‌సైజ్‌లు చేసి ఫిట్‌ అవ్వాలని ఫిక్స్‌ అయ్యాడట. అనుకున్నదే తడవుగా కసరత్తులు మొదలుపెట్టి బాడీని బలంగా మార్చుకున్నాడట. ఆ తర్వాత క్లాస్‌లో తనను కొట్టేవాళ్లే లేరు అని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు రిషభ్‌. అంతేకాదు తన కంటే పెద్ద తరగతి స్టూడెంట్‌లను కూడా గొడవల్లో కొట్టి తన రియాక్షన్‌ చూపించాను అని చెప్పాడు రిషభ్‌.

అప్పటి నుండి స్కూల్లో తనో హీరో అని స్కూల్‌ డేస్‌ గుర్తు చేసుకున్నాడు. ఇక చదువులో అంతంత మాత్రంగానే ఉండేవాడినని, ఎక్స్‌ట్రా కరికులర్‌ యాక్టివిటీల మీదే తన దృష్టి ఉండేది అని రిషభ్‌ చెప్పుకొచ్చాడు. తను అంతలా అల్లరి చేసిన ప్రభుత్వ పాఠశాలను రిషభ్‌ ఇప్పుడు దత్తత తీసుకొని అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాడు. ఇక తను దర్శకత్వం వహించిన సినిమాల్లో స్కూలు, కాలేజీ సన్నివేశాలకు తను చదువుకున్న రోజులు, అప్పటి పరిస్థితులే స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు.

Rishab Shetty Adopts Government School in his Hometown (1)

ఇక దత్తత విషయానికొస్తే రిషభ్‌ శెట్టి ఫౌండేషన్‌ కింద తన స్కూలుకు బస్సు, తరగతి గదుల రినోవేషన్‌ లాంటి పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు కూడా సాయం చేస్తున్నారు. తను చదివిన స్కూలును కాపాడుకోవడం కోసం రిషభ్‌ పడుతున్న కష్టం, చూపిస్తున్న ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

జాన్వీ కపూర్‌ కొత్త డ్రెస్‌ అదుర్స్‌..ఆ రేటు వింటే మాత్రం బెదుర్స్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.