March 19, 202501:46:59 PM

Samyuktha Menon: సంయుక్త మీనన్ ఏంటి.. ఇలా అయిపోయింది..!

తెలుగు ప్రేక్షకులకి సంయుక్త మీనన్ (Samyuktha Menon)  ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాలో పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) చెల్లిగా.. రానా (Rana Daggubati ) భార్యగా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్ లో ఈమె కీలక పాత్ర పోషించింది. తర్వాత ఈమె చేసిన ‘బింబిసార’ (Bimbisara) ‘సార్’ (Sir) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. వాటి తర్వాత చేసిన ‘డెవిల్’ (Devil) అంతగా ఆడలేదు కానీ.. సంయుక్త పాత్రకి మంచి పేరొచ్చింది.

Samyuktha Menon

అయితే సంయుక్త ఎందుకో ఇప్పుడు కొంచెం డౌన్ అయినట్టు కనిపిస్తుంది. ‘లవ్ మీ’ లో (Love Me)  చేసిన గెస్ట్ రోల్ వర్కౌట్ కాలేదు. ఆఫర్లు కూడా తగ్గినట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కుతున్న ‘స్వయంభు’  (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. అలాగే రాజేష్ దండా (Rajesh Danda)  నిర్మాణంలో ఓ విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తుంది. వాటిపై బజ్ లేదు. ఇవన్నీ పక్కన సంయుక్త (Samyuktha Menon) లుక్స్ కూడా ఇప్పుడు మారిపోయింది.

తాజాగా ఆమె ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చింది. ఇందులో ఆమె ఫేస్ గుర్తుపట్టలేని విధంగా ఉంది. చాలా మంది నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ‘సంయుక్త సర్జరీ వంటివి ఏమైనా చేయించుకుందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి వాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది. మరోపక్క ఈమె ‘బింబిసార 2’ లో కూడా నటించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది.

₹1400 కోట్లు దాటేసిన ‘పుష్ప 2’.. ఇండియన్‌ రికార్డుకు జస్ట్‌ 6 వేల కోట్లే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.