March 22, 202501:58:33 AM

Satyadev: హీరోగా సక్సెస్..లు రాకపోవడానికి కారణం అదే అంటున్న సత్యదేవ్.. కానీ..!

Satyadev Doing These Mistake Details Here Goes Viral (1)

సత్యదేవ్ (Satya Dev)  ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో కెరీర్ ను ప్రారంభించాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. perfect) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) వంటి సినిమాల్లో హీరోల ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకడిగా కనిపించాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఇతనికి ‘జ్యోతి లక్ష్మీ’  (Jyothi Lakshmi) తో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  హీరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నుండి దాదాపు ప్రతి సినిమాలో ఇతనికి ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఇక సత్యదేవ్ కూడా హీరోగా చేస్తూనే మరోపక్క పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అతను చేస్తున్న పాత్రలకు మంచి పేరు వస్తుంది.

Satyadev

కానీ హీరోగా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ (Uma Maheswara Ugra Roopasya)  సినిమా బాగానే ఉన్నా.. అది ఓటీటీకి వెళ్లడం వల్ల సత్యదేవ్ కి (Satyadev) ఏమీ కలిసి రావడం లేదు. పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేయడం వల్ల ఇతనికి పెద్ద దర్శకులతో, పెద్ద హీరోలతో ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. అందుకే సత్యదేవ్ హీరోగా చేస్తున్న సినిమాల ఈవెంట్లకి పెద్ద దర్శకులు, పెద్ద హీరోలు హాజరవుతూ ఉంటారు. వాటి వల్ల అతని సినిమాలకి మంచి పబ్లిసిటీ ఏర్పడుతుంది కానీ.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు నిలబడలేకపోతున్నాయి.

‘దీనికి కారణం ఏంటి?’ అని సత్యదేవ్ ఆలోచించుకుంటున్నాడట.హీరోగా చేస్తున్న సినిమాలు ఎక్కువగా కొత్త దర్శకులతో పని చేయడం వల్ల.. అతనికి హిట్లు రావడం లేదు అని సత్యదేవ్ తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నాడట. ఇది అతని వెర్షన్ కావచ్చు. కానీ వాస్తవానికి సత్యదేవ్ ని హీరోగా చూడాలని ఎంతమంది ప్రేక్షకులు అనుకుంటున్నారు? అతని సినిమాలకి టికెట్ కొనుక్కుని వెళ్లాలనే ప్రేక్షకులు ఉన్నారా? అనేది అతను అంచనా వేసుకోవడం లేదు.

సత్యదేవ్ సినిమాలు ఓటీటీల్లో చూడటానికి బాగుంటాయి అని చాలా మంది అనుకుంటున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అతను నటించిన రెండు, మూడు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే సత్యదేవ్ ను హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళలా ఆడియన్స్ మాత్రం సత్యదేవ్ సినిమాలకి థియేటర్లలో డబ్బులు పెట్టాలని చూడట్లేదు.

ఓటీటీ ప్రేక్షకులు మాత్రమే సత్యదేవ్ ని హీరోగా చూడాలి అనుకుంటున్నారు. ఇది సత్యదేవ్ (Satyadev) గ్రహించాలి. ఇటీవల అతను హీరోగా వచ్చిన ‘జీబ్రా’ కి (Zebra)  పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. సో ఇలాంటివి అంచనా వేసుకోకుండా కొత్త వాళ్ళతో సినిమాలు చేయడం వల్ల తన సినిమాలు ఆడట్లేదు అనే భ్రమలో సత్యదేవ్ ఉన్నట్టు స్పష్టమవుతుంది. థియేట్రికల్ గా సక్సెస్..లు వస్తే పారితోషికం పెంచుకోవాలనే ఆశ కూడా అతనికి గట్టిగా ఉందని ఇన్సైడ్ టాక్.

ఆ సినిమా కథ 70 మందికి చెప్పారట.. ఎవరూ ఊహించలేదట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.