March 27, 202510:10:08 PM

Sree Vishnu: హిట్‌ సినిమా సీక్వెల్‌లో ఐటెమ్‌ సాంగ్‌కి శ్రీవిష్ణు హీరోయిన్‌ రెడీ..!

సినిమాతో ఇటు గ్లామర్‌గా, అటు నటన పరంగా మంచి పేరు తెచ్చుకుంది రెబా మోనికా జాన్‌ (Reba Monica John) . ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమాతోనే ఇది సాధ్యం చేసుకుంది రెబా మోనికా. అప్పటికే ఆమె మనకు ‘విజిల్‌’ (Bigil) సినిమాతో మనకు పరిచయమే. అయితే ‘సామజవరగమన’తోనే ఆమె హీరోయిన్‌గా మన దగ్గరకు వచ్చింది. ఆ సినిమా విజయం తర్వాత వరుస ఛాన్స్‌లు సంపాదిస్తుంది అని వార్తలొచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ లోపు ఆమె ఓ ఐటెమ్‌ సాంగ్‌కి రెబా మోనికా ఓకే చెప్పింది అంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది.

Reba Monica John

నార్నె నితిన్(Narne Nithin),  సంగీత్‌ శోభన్ (Sangeeth Shobhan), రామ్‌ నితిన్‌  (Ram Nithin) ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. ఈ సినిమాలోనే రెబా మోనికా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడబోతోందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో టీమ్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గతేడాది వచ్చిన ‘మ్యాడ్‌’ (MAD) సినిమాకు ఇది సీక్వెల్‌ అని తెలిసిందే. రెబా మోనికా జాన్‌ విషయం చూస్తే.. 30 ఏళ్ల ఈ భామ 2016లో ‘జాకబ్‌ఇంటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.

‘పైప్పిన్‌ చువాట్టిలే ప్రణయం’, అనే సినిమా మలయాళంలో చేశాక.. 2018లో ‘జరుగండి’ అనే తమిళ సినిమా చేసింది. ఆ తర్వాతనే ‘బిగిల్‌’/ ‘విజిల్‌’ సినిమా చేసింది. అందులో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ధనషు రాశి నెయర్‌గలే’, ‘ఫోరెన్సిక్‌’, ‘రత్నన్‌ ప్రపంచ’,‘ఎఫ్‌ఐఆర్‌’, ‘ఇన్నాళె వారే’, ‘బూ’ సినిమాలు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.

అప్పుడే ‘సామజవరగమన’ సినిమా ఛాన్స్‌ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ‘రజినీ’, ‘అవల్‌ పెయార్‌ రజిని’ అనే సినిమాలు చేసింది. ‘సకలకళా వల్లభ’ అనే సినిమాలో ఆమె నటించినా అది వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. మరిప్పుడు ప్రత్యేక గీతం ఆమె కెరీర్‌కు ఏమైనా బూస్టింగ్‌ ఇస్తుందేమో చూడాలి.

డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మత్తు వదలరా 2’!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.