March 21, 202502:55:58 AM

Venky Mama Collections: ‘వెంకీ మామ’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ (Venky Mama) . నిజజీవితంలో కూడా చైతన్య వెంకటేష్ కి మేనల్లుడు. అందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై హైప్ ఏర్పడింది. బాబీ కొల్లి (K. S. Ravindra) దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్(Payal Rajput), నాగ చైతన్య..ల సరసన రాశీ ఖన్నా (Raashi Khanna).. హీరోయిన్లుగా నటించారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల పై సురేష్ బాబు (D. Suresh Babu),టి జి విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad).. కలిసి ఈ చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

Venky Mama Collections

Venky Mama Movie Review3

2019 డిసెంబర్ 13న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది. పైగా ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో ‘వెంకీ మామ’ ట్రెండ్ అవుతుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 12.70 cr
సీడెడ్ 5 cr
ఉత్తరాంధ్ర 5.49 cr
ఈస్ట్ 2.47 cr
వెస్ట్ 1.51 cr
కృష్ణా 1.99 cr
గుంటూరు 2.42 cr
నెల్లూరు 1.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 cr
ఓవర్సీస్ 3.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 38.60 cr (share)

‘వెంకీమామ’ చిత్రం 32.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 38.60 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.6.4 కోట్ల ప్రాఫిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ‘వెంకీ మామ’.

అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి చేసిన స్టార్స్..వీడియో వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.