March 22, 202507:40:10 AM

Vidudala Part 2: ‘విడుదల 2’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి  (Vijay Sethupathi), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విడుదల'(మొదటి భాగం) గత ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను రాబట్టుకుంది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ‘గీతా’ సంస్థ రిలీజ్ చేసినప్పటికీ.. ‘విడుదల’ సినిమాకి ఇక్కడ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే సెకండ్ పార్ట్ పై కొంచెం బజ్ ఉంది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అయ్యి..

Vidudala Part 2

ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందుకుంది. అందువల్ల ‘విడుదల 2’ కి (Vidudala Part 2) తెలుగులో డీసెంట్ బిజినెస్ జరిగింది. ఒకసారి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 1.00 cr
సీడెడ్ 0.40 cr
ఆంధ్ర(టోటల్) 0.60 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.00 cr

‘విడుదల 2’ (Vidudala Part 2) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ముఫాసా’ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). వంటి సినిమాలు పోటీగా ఉన్నాయి. మరి ఆ పోటీలో ఈ సినిమా టార్గెట్ ను రీచ్ అవ్వాలి అంటే పాజిటివ్ టాక్ రావాలి. విజయ్ సేతుపతి గత సినిమా ‘మహారాజ’ అయితే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టింది.

‘బచ్చల మల్లి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.