ఈ ఏడాది ‘మహారాజ’ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి గత వారం ‘విడుదల 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023 లో వచ్చిన ‘విడుదల’ మొదటి భాగం క్రిటిక్స్ ను మెప్పించింది. అందులో ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచింది. కానీ సెకండ్ పార్ట్ ఆశించిన స్థాయిలో లేదు అనే టాక్ రిలీజ్ రోజున రావడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది.
Vidudala Part 2 Collections:
వీకెండ్ ను ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా మొదటి సోమవారం నాడు మరింతగా డౌన్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే
నైజాం | 0.23 cr |
సీడెడ్ | 0.11 cr |
ఆంధ్ర(టోటల్) | 0.20 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.54 cr |
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.0.54 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.2.96 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘పుష్ప 2’ ‘ముఫాసా’ వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల ‘విడుదల 2’ క్యాష్ చేసుకోలేకపోతుంది అని స్పష్టమవుతుంది. కానీ బ్రేక్ ఈవెన్ ఇక కష్టంగానే ఉంది.