March 20, 202512:29:05 PM

2025 సమ్మర్లో కూడా పెద్ద సినిమాలు ఉండవా?

No Big Movies in 2025 Summer from Tollywood

పండుగ సీజన్లో కావచ్చు, సెలవుల సీజన్లో కావచ్చు.. పెద్ద సినిమాలు (Movies) రిలీజ్ అయితే అదో రకమైన ఆనందం ఉంటుంది ప్రేక్షకులకి..! మామూలు రోజుల్లో కంటే ఇలాంటి టైంలో వాళ్ళు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా పెద్ద హీరో సినిమానో లేక హిట్టు సినిమా ఉంటేనే. లేదు అంటే ఆ టైంలో కూడా థియేటర్లు విలవిల పోతాయి అనడంలో సందేహం లేదు. 2023 సమ్మర్లో చూసుకుంటే ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు.

Movies

కానీ ‘దసరా’ (Dasara) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి సినిమాలు కొంచెం ఆడుకున్నాయి. అదే 2024 సమ్మర్ చూసుకుంటే చాలా దారుణం. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తర్వాత రిలీజ్ అయిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమా డిజాస్టర్ అయ్యింది. తర్వాత కనీసం మిడ్ రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) వంటి సినిమాలకి హిట్ టాక్ వచ్చినా.. జనాలు వాటిని పట్టించుకోలేదు. మరోపక్క ఐపీఎల్, ఎలక్షన్స్ సీజన్ల వల్ల.. సినిమాలను ఆడియన్స్ పక్కన పెట్టేశారు.

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

ఇప్పుడు 2025 సమ్మర్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉండబోతుందా అనే భయాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ సమ్మర్ కి ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), రజినీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ (Coolie) వంటి సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ ‘ది రాజాసాబ్’  వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ కంప్లీట్ కాలేదు. కాబట్టి రిలీజ్ అవుతుందా అంటే డౌటే. ఇక రజినీకాంత్ ‘కూలీ’ కూడా పోస్ట్ పోన్ అయ్యింది.

సో ఇలాంటి టైం నాని (Nani) ‘హిట్ 3’ , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘జాక్’ నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) రవితేజ (Ravi Teja) ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమాలే పెద్ద దిక్కు అయ్యేలా ఉన్నాయి. ఇవి కూడా కచ్చితంగా రిలీజ్ అవుతాయా అంటే చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ హాప్ అంతా ఆ సినిమాల (Movies) పైనే ఉందని చెప్పాలి.

సన్యాసిగా ఒకప్పటి హీరోయిన్.. లేటెస్ట్ వీడియో వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.