శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి(Sai Pallavi)..జంటగా నటించిన ‘అమరన్’ (Amaran) సినిమా గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. పోటీగా తెలుగు సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎక్కడా తగ్గలేదు. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని ‘అమరన్’ రూపొందింది.
Amaran Collections:
ఆల్రెడీ ఈ సినిమా (Amaran) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 12.30 cr |
సీడెడ్ | 3.10 cr |
ఉత్తరాంధ్ర | 4.90 cr |
ఈస్ట్+వెస్ట్ | 1.80 cr |
కృష్ణా + గుంటూరు | 3.20 cr |
నెల్లూరు | 0.75 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 26.05 cr |
‘అమరన్’ (Amaran) చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.26.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.21 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబ్బింగ్ సినిమాల్లో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.