February 28, 202504:38:40 AM

బ్లాక్‌బస్టర్‌ ఓటీటీ సిరీస్‌ రెండో సీక్వెల్‌… రిలీజ్‌ డేట్‌ ఇదే!

Squid Game season 3 streaming date

ఓటీటీ వెబ్‌సిరీసుల్లో ‘స్క్విడ్‌ గేమ్‌’ లెక్క వేరు. ఎన్ని వెబ్‌ సిరీస్‌లు వచ్చినా. ‘స్క్విడ్‌ గేమ్‌’ ఇచ్చే కిక్‌ అవేవీ ఇవ్వవు అంటారు. అందుకే 2021లో తొలి సీజన్‌ వచ్చినప్పటి నుండి రెండో సీజన్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూశారు. ఎట్టకేలకు గతేడాది డిసెంబరులో వచ్చింది. మూడో సీజన్‌ కోసం మరో మూడేళ్లు వెయిట్‌ చేయాలా ఏంటి అని ఫ్యాన్స్‌ అనుకుంటుండగా.. మీరు అన్ని రోజులు వెయిట్‌ చేయక్కర్లేదు అంటూ టీజ్‌ చేస్తూ వచ్చింది. తాజాగా ‘స్క్విడ్‌ గేమ్‌’ మూడో సీజన్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను టీమ్‌ అనౌన్స్‌ చేసింది.

Squid Game Season 3

Squid Game season 3 streaming date

జూన్ 27న ఈ అవైటెడ్ సిరీస్ ముగియనున్నట్టు నెట్ ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2021లో వచ్చిన ‘స్క్విడ్‌ గేమ్‌’ ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. స్ట్రీమింగ్‌ మొదలైన 27 రోజుల్లోనే 111 మిలియన్‌కి పైగా వ్యూస్‌ దక్కించుకొని భారీ విజయం అందుకుంది. ‘స్క్విడ్‌ గేమ్‌ 2’ కూడా ఆ స్థాయి విజయం అందుకుంది. మొదటి వారం అత్యధికంగా 68 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సిరీస్‌ 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ ర్యాకింగ్స్‌లో నెం 1 స్థానంలో నిలిచింది. ఇప్పుడు మూడో సిరీస్‌ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

What if Tollywood Heroes Act in Squid Game (1)

‘స్క్విడ్‌ గేమ్‌ 2’ విషయానికొస్తే.. షియెంగ్‌ జీ హున్‌ (లీ జంగ్‌ జే) ‘స్క్విడ్‌ గేమ్‌’  ( Squid Game Season 3)అన్ని స్టేజీలు పూర్తి చేస్తాడు. ఈ క్రమంలో 45.6 బిలియన్‌ కొరియన్‌ వన్‌లు గెలుచుకుంటాడు. కానీ మనుషులనే పావులుగా ఈ ఆట ఆడిస్తున్న మాస్క్‌ ఫ్రంట్‌ మ్యాన్‌ అనే వ్యక్తిని కనిపెట్టి గేమ్‌కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తాడు. ఈ గేమ్‌లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడానికి తను గెలుచుకున్న ప్రైజ్‌ మనీ ఖర్చు పెట్టేస్తుంటాడు.

మరోవైపు గాయపడిన హ్వాంగ్‌ జున్‌ హో (వి హా జూన్‌) కోలుకుని, డిటెక్టివ్‌ ఉద్యోగంలో చేరతాడు. అలా ఓ రోజు షియెంగ్‌ జీని కలుస్తాడు. ‘స్క్విడ్‌గేమ్‌’ను ఎవరు ఆడిస్తున్నారని ఇద్దరూ తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తారు. మరి వారి ప్రయత్నాలు ఫలించాయా? అనేది రెండో పార్టు కథ. అయితే ఈ కథను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు మూడో పార్టుతో మొత్తం విషయాన్ని ముగిస్తారు.

టాలీవుడ్‌లో డిజాస్టర్స్ ట్రెండ్ పెరుగుతోందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.