March 17, 202506:03:46 PM

మహేష్ ఫ్యామిలీ నుంచి మరో మేనల్లుడు!

Mahesh Babu family welcomes another hero

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) టాలీవుడ్‌లో తన ప్రస్థానం మొదలుపెట్టినప్పటికీ, ఇప్పటి వరకు ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు. హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక్, ఆ తర్వాత దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. ప్రస్తుతం తన మూడో ప్రయత్నం కోసం అశోక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉండగా, గల్లా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Mahesh Babu

Mahesh Babu family welcomes another hero

అశోక్ గల్లా సోదరుడు సిద్ధార్థ్ గల్లా సినిమా రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ రచయిత గోపీ మోహన్ ప్రత్యేకంగా కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024 చివరి నాటికి సిద్ధార్థ్ లాంచింగ్ జరగవచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గోపీ మోహన్ (Gopimohan) ఇప్పటికే టాలీవుడ్‌లో అనేక విజయవంతమైన చిత్రాలకు కథలు, స్క్రీన్‌ప్లే అందించిన సీనియర్ రచయిత.

‘రెడీ’ (Ready), ‘సంతోషం’ (Santhosham), ‘డూకుడు’ (Dookudu) వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన గోపీ మోహన్, ఈ ప్రాజెక్ట్‌ను కూడా కమర్షియల్‌గా విజయవంతం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ చిత్రానికి కేవలం రచయితగానే ఉంటాడా? లేక దర్శకుడిగా మారతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. గోపీ మోహన్ గతంలో కొన్ని ప్రాజెక్టులకు దర్శకత్వం వహించాలని భావించినా, ఎందుకో సెట్టవ్వలేదు.

Mahesh Babu family welcomes another hero

ఈసారి గల్లా ఫ్యామిలీ వారసుడి డెబ్యూ ప్రాజెక్ట్ కోసం ఆయన కెప్టెన్‌షిప్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కథ ప్రకారం, ఈ చిత్రం కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కాకుండా యాక్షన్‌, కామెడీ మేళవింపుతో ఉంటుందని టాక్. మరి, ఈ కొత్త హీరో ప్రస్థానం గోపీ మోహన్‌తో కలిపి టాలీవుడ్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మహేష్- రాజమౌళి పారితోషికాల లెక్కలు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.