నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి.కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చాక ‘డాకు మహారాజ్’ కలెక్షన్స్ తగ్గాయి. టార్గెట్ పెద్దగా ఉండటంతో ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఉన్నంతలో సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది కానీ… రెండో వీకెండ్ పై ఎక్కువ భారం పడినట్టు అయ్యింది.
Daaku Maharaaj Collections:
ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.45 cr |
సీడెడ్ | 11.65 cr |
ఉత్తరాంధ్ర | 10.28 cr |
ఈస్ట్ | 6.93 cr |
వెస్ట్ | 5.05 cr |
గుంటూరు | 7.46 cr |
కృష్ణా | 5.27 cr |
నెల్లూరు | 3.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 63.24 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.81 cr |
ఓవర్సీస్ | 7.92 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 74.97 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 రోజుల్లో ఈ సినిమా రూ.74.97 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.53 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కి కొత్త సినిమాలు లేవు. ఆ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి.