నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బాబీ (K. S. Ravindra) కలయికలో రూపొందిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చాక డౌన్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ కోసం స్టడీ రన్ కొనసాగిస్తుంది. అయితే రెండో వీకెండ్ ను ఈ సినిమా అనుకున్నట్టు క్యాష్ చేసుకోలేదు. దీంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయ్యింది.
Daaku Maharaaj Collections:
ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 14.05 cr |
సీడెడ్ | 12.17 cr |
ఉత్తరాంధ్ర | 10.89 cr |
ఈస్ట్ | 7.07 cr |
వెస్ట్ | 5.14 cr |
గుంటూరు | 7.57 cr |
కృష్ణా | 5.38 cr |
నెల్లూరు | 3.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.00 cr |
ఓవర్సీస్ | 8.09 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 77.56 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వారాల్లో ఈ సినిమా రూ.77.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు. దీంతో రాబోయే రోజుల్లో కూడా నిలదొక్కుకోవడం కష్టమనే చెప్పాలి.