రాంచరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali) హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది కాబట్టి మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు ఈ సినిమా అందుకోలేదు. మొదటి షోతోనే సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.
Game Changer Collections
మొదటి వారం సో సోగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండో వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.’గేమ్ ఛేంజర్’ (Game Changer) 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 18.95 cr |
సీడెడ్ | 10.25 cr |
ఉత్తరాంధ్ర | 10.16 cr |
ఈస్ట్ | 6.18 cr |
వెస్ట్ | 4.05 cr |
కృష్ణా | 5.20 cr |
గుంటూరు | 6.16 cr |
నెల్లూరు | 3.56 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 64.51 cr |
కర్ణాటక | 4.84 cr |
తమిళనాడు | 3.49 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.00 cr |
నార్త్ | 14.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 101.22 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.101.22 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.153.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.