మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి అని చెప్పాలి. రెండో రోజు కూడా నైజాం, నార్త్ వంటి ఏరియాల్లో పర్వాలేదు అనిపించింది.
Game Changer Collections:
ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.35 cr |
సీడెడ్ | 7.67 cr |
ఉత్తరాంధ్ర | 5.98 cr |
ఈస్ట్ | 3.72 cr |
వెస్ట్ | 2.35 cr |
కృష్ణా | 3.16 cr |
గుంటూరు | 4.32 cr |
నెల్లూరు | 2.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 42.87 cr |
కర్ణాటక | 2.95 cr |
తమిళనాడు | 2.03 cr |
కేరళ | 0.18 cr |
ఓవర్సీస్ | 10.46 cr |
నార్త్ | 7.89 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 66.38 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమాకి రూ.66.38 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.183.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ రియల్ లైఫ్ క్యారెక్టర్.. ఎవరతను?