రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రావడం లేదు. సంక్రాంతి సెలవుల వల్ల కొంతవరకు క్యాష్ చేసుకున్న ఈ సినిమా.. తర్వాత డౌన్ అయ్యింది.
Game Changer Collections:
అతి కష్టం మీద వంద కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ‘గేమ్ ఛేంజర్’ 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.14 cr |
సీడెడ్ | 10.36 cr |
ఉత్తరాంధ్ర | 10.29 cr |
ఈస్ట్ | 6.22 cr |
వెస్ట్ | 4.07 cr |
కృష్ణా | 5.25 cr |
గుంటూరు | 6.21 cr |
నెల్లూరు | 3.59 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.13 cr |
కర్ణాటక | 4.86 cr |
తమిళనాడు | 3.56 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.05 cr |
నార్త్ | 14.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 102.11 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.11 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.89 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.