‘హైరానా’ పాట కోసం ‘నానా హైరానా’ ‘గేమ్ ఛేంజర్’లో మిస్ అయిన సాంగ్.. ఎందుకు ఈ తర్జనభర్జనలు ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో హైలైట్ పాయింట్ అంటూ చాలా రోజులుగా చెబుతున్న విషయం ‘నానా హైరానా..’ పాట. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తెరకెక్కించిన ఆ పాటను చూద్దామని థియేటర్లకు తొలి రోజు ప్రీమియర్‌షోకి వెళ్లినవాళ్లకు షాక్ తగిలింది. సినిమా ఇలా మొదలైందో లేదో సినిమా టీమ్ నుండి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదే ఆ పాట సినిమాలో లేదు అని. ఆ తర్వాత తీసుకొస్తామని చెప్పినా.. మళ్లీ డౌట్స్ వచ్చాయి.
Game Changer
ఇప్పుడు పాట అయితే వచ్చింది కానీ ఆ డౌట్స్ అలానే ఉన్నాయి. మొదటి డౌట్‌కి కారణం సంగీత దర్శకుడు తమన్. సంక్రాంతి సందర్భంగా రెండు సినిమాలతో హైలైట్‌గా నిలిచిన తమన్ మాట్లాడుతూ.. ‘నానా హైరానా..’ పాట గురించి కూడా మాట్లాడాడు. అయితే ఆయన చెప్పిన విషయం, సినిమా టీమ్ చెప్పిన విషయం ఒకటి కాకపోవడం గమనార్హం. టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ పాట పెట్టలేదు అని టీమ్ చెబుతుంటే.. తమనేమో ప్లేస్‌మెంట్ కుదరక పెట్టలేదు అని చెబుతున్నారు. దీంతో ‘హైరానా’ గురించి నానా హైరానా పడుతున్నారు అని అనిపించింది.
జనవరి 14 నుండి ‘నానా హైరానా..’ పాటను సినిమాలో యాడ్ చేస్తామని ప్రకటించింది టీమ్. అయితే ‘గేమ్ ఛేంజర్’ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు రామ్ చరణ్, కియారా మధ్య లవ్ ట్రాక్‌కి ఎక్కువ స్కోప్ పెట్టారని, దానికి అనుగుణంగా మెలోడీ పాట ఒకటి ఉంటే బాగుంటుందని ‘నానా హైరానా..’ కంపోజ్ చేశామని తమన్ చెప్పారు. షూటింగ్ అయిపోయి ఫైనల్ కాపీ చూసుకునే టైంలో ఫ్లోకి అడ్డొస్తుందని పాట తీసేశామని తమన్ అంటున్నారు.
సినిమా ఫస్ట్ హాఫ్‌లో ‘ధోప్..’, ‘రా మచ్చా..’ పాటలు ఉండగా.. సెకండాఫ్‌లో ‘కొండదేవర..’, ‘అరుగు మీద..’ ఉన్నాయని. ఇంకో పాట వస్తే సినిమా ఫ్లో పోతుంది అనేది తమన్ మాట. మరి ఇప్పుడు కలుపుతామంటున్నారు.. ఎక్కడ కలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. తొలుత 14 నుండి పాటను యాడ్ చేస్తామని చెప్పిన టీమ్ ఏమైందో ఏమో ఈ రోజు నుండే లైవ్‌లోకి తెచ్చేశారు. రెండు రోజుల్లో టెక్నికల్ సమస్యలు పోయాయా? లేక ప్లేస్ మెంట్ సరిపోయిందా? ఏం జరిగింది. ఎందుకు కన్‌ఫ్యూజన్.