తెలంగాణాలో `గేమ్ ఛేంజర్` (Game Changer) టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదు ఎక్స్ట్రా షోలకి కూడా అనుమతులు ఇచ్చారు. రోజుకు 6 షోలకి కూడా అనుమతులు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో రోజుకు 4,5 షోలు ఉంటాయి. అయితే ఇప్పుడు 6 షోలకు అనుమతులు లభించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక టికెట్ రేట్ల హైక్ విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 , మల్టీప్లెక్సుల్లో రూ.150 వరకు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది. 15 రోజుల వరకు ఈ హైక్స్ ఉంటాయి. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి టికెట్ రేట్లు పెంచడంతో ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురుస్తుంది.
Game Changer
అయినా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకి, సామాజిక బాధ్యత తెలుపుతూ తీసే సినిమాల కోటాలో ‘గేమ్ ఛేంజర్'(Game Changer) కి టికెట్ రేట్లు పెంచినట్టు తెలుస్తుంది. ఈ సినిమా జనవరి 10 న విడుదల కాబోతుంది. శనివారం నుండి సంక్రాంతి సెలవులు మొదలవుతాయి కాబట్టి. ఎక్కువ శాతం జనాలు ఆంధ్రాకి వెళ్తారు. సో రెండో రోజు నుండి ఎక్కువ టికెట్ రేట్లు ఉంటే… ఫుట్ ఫాల్స్ ఎక్కువ రిజిస్టర్ అవుతాయి అని చెప్పలేం. అలాంటప్పుడు ఎక్కువ రోజులు హైక్స్ అనవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టాక్ కనుక బాగుంటే సెలవులు ముగిశాక.. కూడా ‘గేమ్ ఛేంజర్’ పెర్ఫార్మన్స్ బాగుంటుంది. సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి లాంగ్ రన్ కూడా ఉంటుంది. మరి ఆ అవకాశం ‘గేమ్ ఛేంజర్'(Game Changer) కి లభించాలి అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
Game Changer First Review: శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామా.. ఎలా ఉంది?