మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు దిల్ రాజు. ఇక ఈరోజు అనగా జనవరి 10న.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంటుంది. సినిమాలో ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ బాగా వచ్చిందట. ఫస్ట్ హాఫ్ బాగుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందట.
Game Changer
ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే అప్పన్న రోల్ కూడా చాలా బాగుందని అంటున్నారు. అలాగే ఎస్.జె.సూర్య, రాంచరణ్..లకి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంటాయని చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సినిమాలో ఒక పాట మిస్ అవ్వడం పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది.అదేంటంటే ‘నానా హైరానా’ అనే లిరికల్ సాంగ్ మంచి స్పందన పొందింది. శ్రేయ ఘోషల్, కార్తీక్ వంటి స్టార్ సింగర్స్ పాడిన ఈ పాటలోని విజువల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వాస్తవానికి ‘గేమ్ ఛేంజర్’ ఆల్బమ్లో ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయిన సాంగ్ కూడా ఇదే. అయితే సినిమాలో ఈ పాట మిస్ అయ్యింది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల.. ఈ పాటని తొలగించినట్టు సమాచారం. అయితే జనవరి 14, భోగి పండుగ నుండి ఈ పాటని యాడ్ చేస్తారట. రిపీట్ ఆడియన్స్ కి ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.