మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. మరి అంత మొత్తం ఈ సినిమా వెనక్కి రాబట్టగలదా? లేదా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలో గత 10 సినిమాల నుండి చరణ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
1) రచ్చ :
రాంచరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్..లు కలిసి నిర్మించారు. రూ.38.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.47.20 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.7.5 కోట్ల లాభాలు అందించి కమర్షియల్ హిట్ గా నిలిచింది.
2) నాయక్ :
రాంచరణ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. రూ.44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.47.38 కోట్ల షేర్ ని రాబట్టింది. రూ.3.38 కోట్ల లాభాలతో ఈ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరింది.
3) తుఫాన్ :
రాంచరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. పారలల్ గా తెలుగులో కూడా తెరకెక్కించారు.అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి .. ఫుల్ రన్లో కేవలం రూ.18.2 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
4) ఎవడు :
రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.44.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి… ఫుల్ రన్ ముగిసేసరికి రూ.47.10 కోట్ల షేర్ ను రాబట్టింది. టోటల్ గా బయ్యర్లకి రూ.2.6 కోట్ల వరకు లాభాలను అందించి డీసెంట్ హిట్ గా నిలిచింది.
5) గోవిందుడు అందరివాడేలే :
రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.48 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో రూ.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి యావరేజ్ మూవీగా నిలిచింది.
6) బ్రూస్ లీ :
రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.59 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. ఫుల్ రన్లో కేవలం రూ.39 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.
7) ధృవ :
రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.55 కోట్ల షేర్ ను రాబట్టింది. నోట్ల రద్దు టైంలో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.
8) రంగస్థలం :
రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.80.36 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.119 కోట్ల షేర్ ను రాబట్టింది.
9) వినయ విధేయ రామ :
రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు.బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.61 కోట్ల షేర్ ను రాబట్టి.. డిజాస్టర్ గా మిగిలింది.
10) ఆర్.ఆర్.ఆర్ :
రాంచరణ్, ఎన్టీఆర్..లు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ గా రూ.608 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.108 కోట్ల లాభాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మిగిలింది.