March 24, 202510:07:42 AM

Hanu Raghavapudi: నాని కథతో ప్రభాస్‌.. క్లారిటీ ఇచ్చిన హను.. ఏమన్నారంటే?

Hanu Raghavapudi clarity on Fauji storyline (1)

ఒక హీరో కోసం అనుకున్న కథను వేరే హీరోతో చేయడం, ఒక హీరోకి రాసుకున్న లైన్‌ను వేరే హీరోకు చెప్పడం, తిరిగి అదే హీరో దగ్గరకు రావడం లాంటి సీన్లు మనం టాలీవుడ్‌లో చాలానే చూశాం. ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమలో ఇది సర్వసాధారణం. అయితే ఒక హీరోకు చెప్పిన కథ.. మరో హీరోకు చెప్పిన ఒకే జోనర్‌లో, ఒకే బ్యాక్‌డ్రాప్‌లో ఉండకూడదు అని రూల్‌ ఏమీ లేవు. ఇప్పుడు ఈ లాజిక్‌ పాయింటే లాగుతున్నారు ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) .

Hanu Raghavapudi

‘సీతా రామం’ (Sita Ramam)  సినిమాతో రీసెంట్‌ మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కిన ఆయన.. ఇప్పుడు ప్రభాస్‌తో (Prabhas)  ‘ఫౌజీ’ ( పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఓ పుకారు తెగ షికారు చేస్తోంది. అదే ‘ఈ సినిమా కథను తొలుత హను రాఘవపూడి నానికి చెప్పారు’ అని. ఈ చర్చకు తన టైపు అంటే టిపికల్‌ ఆన్సర్‌ ఇచ్చి క్లోజ్‌ చేసే ప్రయత్నం చేశారాయన.

ప్రభాస్‌ కోసమే ఇప్పుడు చేస్తున్న కథ రాశాను. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసే ఎన్నో విశేషాలు అందులో ఉంటాయి అని చెప్పారు. అంతేకాదు మీరు ఇంతవరకూ చూడని కథను చూపిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి ఈ సినిమా ప్రేక్షకుల్ని తీసుకెళ్తుంది అని చెప్పారు. ఇక పుకార్లు వస్తున్నట్లు ఈ కథకు నానితో (Nani) చేస్తానని చెప్పిన చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తన దగ్గర ఆరు కథలున్నాయని, అయితే ఈ కథ ఆ ఆరులోనిది కాదు అని చెప్పారు హను. ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రభాస్‌ కోసమే రాశానని, ‘సీతారామం’ సినిమా తర్వాత ఈ కథ రాయడానికి ఏడాది పట్టిందని చెప్పారు. ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ కథానాయికగా నటిస్తోంది. సినిమా ఓ కొలిక్కి వస్తే రిలీజ్‌ డేట్ల గురించి మాట్లాడదామని టీమ్‌ అనుకుంటోంది.

ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు రాష్ట్ర మంత్రి.. పెద్దోడు ఎంపీ.. మెగా ఫ్యామిలీలో పీక్‌ టైమ్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.