నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD పాన్ ఇండియా సినిమాల పరంగా తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో దృశ్య కావ్యంగా ప్రేక్షకులను మెప్పించింది. విడుదల తర్వాత భారీ వసూళ్లు సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇప్పుడు, మేకర్స్ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టారు.
Kalki 2898 AD
ఇప్పటికే కల్కి 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత అశ్విని దత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీక్వెల్ కథ ప్రధానంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రల చుట్టూ తిరగనుందని పేర్కొన్నారు. మొదటి భాగంలో అమితాబ్ పాత్రకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు, ఈసారి కమల్ పాత్రను మరింత హైలైట్ చేయనున్నట్లు సమాచారం.
కమల్ హాసన్ “కలి” పాత్రకు రెండో భాగంలో పూర్తి స్క్రీన్ టైమ్ ఇవ్వనున్నారు. ప్రభాస్‌తో కమల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయని అశ్విని దత్ చెప్పారు. ఇదే సమయంలో అమితాబ్ పాత్రకు కూడా మరింత పవర్ఫుల్ గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖ నటుల మధ్య సన్నివేశాలు కథను మరింత హైలెట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
తొలి భాగంలో దీపికా పదుకొణె పాత్రకు లిమిటెడ్ స్కోప్ ఉండగా, ఈసారి ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. నూతన పాత్రలు పెద్దగా ఉండవని, ప్రధాన పాత్రల చుట్టే కథ సాగుతుందని అశ్విని దత్ వివరించారు. మేజర్ సన్నివేశాలు అన్ని కీలక పాత్రల సమూహంపై ఆధారపడి ఉంటాయని స్పష్టమైంది. కల్కి 2 పాన్ వరల్డ్ ప్రేక్షకుల కోసం సాంకేతిక పరంగా కూడా కొత్త తరహా విజువల్స్ ఉండేలా రూపొందించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2026 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మరోసారి హిట్ కాంబినేషన్లో బాలయ్య మాస్ ప్రాజెక్ట్!