సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు నిలబడటంతో తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది. ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం,’ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు రాబడుతున్నాయి. మూడు సినిమాల జానర్లు విభిన్నంగా ఉండడం ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది.
Sankranti Releases
‘డాకు మహారాజ్’ సినిమా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడంతో మొదటి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ అందుకుంది. బాలయ్య స్టైల్, పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు పెద్ద ట్రీట్‌గా మారాయి. ముఖ్యంగా మాస్ సెంటర్స్‌లో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ, పండుగ సీజన్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథను ప్రెజెంట్ చేసింది.
వెంకటేష్ కెరీర్‌లో ఫ్యామిలీ సినిమాలకు ఉన్న క్రేజ్‌తో ఈ చిత్రం థియేటర్లను పండుగ వాతావరణంగా మార్చింది. ఇక ‘గేమ్ ఛేంజర్’ మొదట్లో భారీ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, ఆ తర్వాత మౌత్ టాక్ తేడాగా రావడంతో కాస్త వెనకబడ్డట్టుగా కనిపిస్తోంది. కానీ భారీ థియేటర్ కౌంట్ కారణంగా సందడిగా కనిపించింది. ప్రధాన నగరాల్లో ఇది మంచి కలెక్షన్లను రాబడుతున్నా, ఇతర ప్రాంతాల్లో టికెట్ అమ్మకాలు కొంత తగ్గినట్టు సమాచారం.
ఈ సినిమాల విజయవంతమైన ప్రదర్శన వల్ల థియేటర్ యాజమాన్యాలకు ప్రత్యేకమైన ఆదాయం కూడా వచ్చింది. క్యాంటీన్ సేల్స్, పార్కింగ్ చార్జెస్, అదనపు సీటింగ్ ఏర్పాట్ల ద్వారా అనుకోని లాభాలు వచ్చాయి. ప్రత్యేకంగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించడంతో, క్యాంటీన్ ఆదాయం మరింతగా పెరిగింది. థియేటర్లలో పండుగ వాతావరణం మరోసారి కనిపించడంతో పరిశ్రమ సక్సెస్ రేటు ఎక్కడిదాకా వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో కూడా ప్లాస్టిక్ కుర్చీలు, అదనపు సౌకర్యాలతో మంచి ఆదాయం రాబడటం గమనార్హం. ఈ సంక్రాంతి సీజన్ సక్సెస్ తెలుగు సినిమా పరిశ్రమకు మరో బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?