March 29, 202501:15:47 AM

Madha Gaja Raja Trailer Review: ‘జబర్దస్త్’ పాత స్కిట్ ప్రోమోలా ఉందిగా..!

Madha Gaja Raja Movie Trailer Review

2012 లో విశాల్ (Vishal) హీరోగా సుందర్ సి (Sundar C)  దర్శకత్వంలో ‘మదగజరాజ’ (Madha Gaja Raja) అనే సినిమా తెరకెక్కింది. ‘జెమినీ ఫిలిం సర్క్యూట్’ వాళ్ళు ఈ సినిమాను నిర్మించారు. అయితే సంతానం ఈ సినిమాపై కేసు వేయడంతో రిలీజ్ ఆగిపోయింది.మొత్తానికి 12 ఏళ్ళ తర్వాత ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని విధంగా ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఓటీటీల ఎఫెక్ట్ వల్ల థియేటర్లకు జనాలు రావడం మానేసిన ఈ రోజులో ‘మదగజరాజ’ సినిమా అక్కడ రూ.50 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది.

Madha Gaja Raja Trailer Review:

Madha Gaja Raja Movie Trailer Review

దీంతో ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని రిక్వెస్ట్..లు వెళ్లాయి. దీంతో జనవరి 31 న ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు . తాజాగా ట్రైలర్ ను వెంకటేష్  (Venkatesh)  లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ 2 నిమిషాల 25 సెకన్ల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ఆరంభంలోనే సాంగ్ విజువల్స్ చూపించి.. వెంటనే విలన్ సోనూసూద్ ని చూపించారు. తర్వాత సంతానం ఎంట్రీ ఇచ్చి ‘మిస్ అయ్యి బావిలో పడ్డాడేమో అనుకున్నాను.

Vishal's 2012 Madha Gaja Raja movie becomes unexpected hit

వీడు ఇద్దరు మిస్సులతో పైకి వచ్చాడు’ అంటూ ఓ కామెడీ డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్లు అయిన వరలక్ష్మీ (Varalaxmi Sarathkumar), అంజలి (Anjali)..లు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ గ్లామర్ తో కూడా ట్రైలర్ ని హైలెట్ చేయాలని చూశారు. ’15 ఏళ్లుగా గాయం ఆరలేదా.. షుగర్ అయ్యి ఉంటుంది. డాక్టర్ కి చూపించుకోరా’ వంటి డైలాగ్స్ పాత జబర్దస్త్ స్కిట్స్ ను గుర్తుచేసే విధంగా ఉన్నాయి.

Vishal Madha Gaja Raja to release for Pongal

12 ఏళ్ళ క్రితం తీసిన సినిమా కాబట్టి.. కొత్త అంశాలు ఏమీ ఆశించలేం. ఆశించకూడదు అని చెబుతూనే ట్రైలర్ సాగింది. ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యి ఎలా రూ.50 కోట్లు కలెక్ట్ చేసిందో అర్థం కాదు. సరే సినిమా కూడా ఇలాగే ఉంటుందేమో జనవరి 31న తెలుస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఒక లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.