విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) రూ.150 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతుంది. రెండో వారం కూడా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా డీసెంట్ షేర్స్ రాబడుతుంది.సంక్రాంతికి పండుగకి మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడుతున్నారు.ఇప్పటికే ‘రంగస్థలం’Rangasthalam) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) వం వంటి సినిమాల రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా.. 3 వారం కూడా నిలబడితే ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) ఫుల్ రన్ షేర్ ను దాటేసే అవకాశం ఉంది.
Sankranthiki Vasthunam Collections:
ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 38.01 cr |
సీడెడ్ | 16.43 cr |
ఉత్తరాంధ్ర | 18.48 cr |
ఈస్ట్ | 12.76 cr |
వెస్ట్ | 8.31 cr |
కృష్ణా | 8.91 cr |
గుంటూరు | 9.66 cr |
నెల్లూరు | 4.29 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 116.85 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 7.94 cr |
ఓవర్సీస్ | 14.71 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 139.50 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 16 రోజుల్లో రూ.139.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.98.5 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.’అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ ను అధిగమిస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. కచ్చితంగా ఈ సినిమా రూ.150 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.