విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ (Bheems Ceciroleo) మంచి సంగీతం అందించాడు. ‘గోదారి గట్టు మీద’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచింది. దీంతో జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Sankranthiki Vasthunam Collections:
4వ రోజు కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టి టాప్ లేపేసింది. ఒకసారి (Sankranthiki Vasthunam) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.36 cr |
సీడెడ్ | 8.49 cr |
ఉత్తరాంధ్ర | 7.17 cr |
ఈస్ట్ | 6.05 cr |
వెస్ట్ | 4.15 cr |
కృష్ణా | 4.66 cr |
గుంటూరు | 5.28 cr |
నెల్లూరు | 2.11 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 54.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.75 cr |
ఓవర్సీస్ | 7.16 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 65.18 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో రూ.65.18 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.24.18 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ వీకెండ్ ను ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరింతగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.