‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari).. వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra) దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాత. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రావడం వల్ల పోటీలో ఈ సినిమాకి కొంచెం కలెక్షన్స్ తగ్గాయి.
Daaku Maharaaj Collections:
కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ గా రన్ అవుతున్నప్పటికీ.. ఓవర్సీస్ వంటి ఏరియాల్లో కొంచెం స్లో అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి (Daaku Maharaaj ) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 11.89 cr |
సీడెడ్ | 10.49 cr |
ఉత్తరాంధ్ర | 8.75 cr |
ఈస్ట్ | 6.01 cr |
వెస్ట్ | 4.48 cr |
గుంటూరు | 7.05 cr |
కృష్ణా | 4.92 cr |
నెల్లూరు | 2.95 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 56.54 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.43 cr |
ఓవర్సీస్ | 7.27 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 67.24 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.67.24 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.16.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి ఏరియాల్లో ఈ సినిమా పెర్ఫార్మన్స్ చాలా వరకు డౌన్ అయ్యింది. చూడాలి మరి వీకెండ్ ను క్యాష్ చేసుకుని అక్కడ కూడా గట్టెక్కుతుందేమో.