విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)..ల కలయికలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 8 రోజుల్లో రూ.110 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ రూ.70 కోట్ల వరకు లాభాలు అందించిన సంగతి తెలిసిందే.
Sankranthiki Vasthunam Collections:
ఇక 9 వ రోజు కూడా అరగొట్టింది. ఒకసారి (Sankranthiki Vasthunam) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 29.84 cr |
సీడెడ్ | 13.74 cr |
ఉత్తరాంధ్ర | 14.82 cr |
ఈస్ట్ | 11.00 cr |
వెస్ట్ | 6.88 cr |
కృష్ణా | 7.74 cr |
గుంటూరు | 8.46 cr |
నెల్లూరు | 3.59 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 96.07 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.90 cr |
ఓవర్సీస్ | 12.56 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 114.53 cr (షేర్) |
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 9 రోజుల్లో రూ.114.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.73.53 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. రెండో వీకెండ్ కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా కలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.