పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్ (Spirit) పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. స్పిరిట్ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు జకార్తా లొకేషన్లలో చిత్రీకరించేందుకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారని టాక్.
Spirit
ఇప్పటికే జకార్తా లొకేషన్లను సందీప్ పరిశీలించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ షూటింగ్ ప్లాన్ చేయబడిందని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో సందీప్ తన టెక్నికల్ టీమ్, ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి మళ్లీ జకార్తాకు వెళ్ళనున్నారని తెలుస్తోంది. ఈ విదేశీ లొకేషన్‌తో పాటు, మిగతా షూటింగ్ భాగం హైదరాబాదు, ముంబై వంటి భారతీయ నగరాల్లోనే జరగనుందని టాక్. స్పిరిట్ కోసం డైరెక్టర్ మరోసారి భారతీయ నేచురల్ లొకేషన్లను ప్రధానంగా ఉపయోగించాలని భావిస్తున్నారట.
సినిమా కథ ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యానికి తగ్గట్లుగా, కొన్ని సన్నివేశాలను జకార్తాలో చిత్రీకరించడం చిత్రానికి కొత్త ఆకర్షణను తెస్తుందని టీమ్ భావిస్తోంది. గతంలో సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) మరియు కబీర్ సింగ్ చిత్రాల కోసం ఆయన విదేశీ లొకేషన్లను వినియోగించలేదు. కానీ, స్పిరిట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కథను ఆవిష్కరించనుండటంతో, ఈసారి విదేశీ లొకేషన్లు అనివార్యమయ్యాయని అంటున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించి కీలక నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ప్రభాస్ పాత్ర కోసం ప్రత్యేకంగా క్లారిటి ఇచ్చిన దర్శకుడు, అతని క్యారెక్టర్ ఎలివేషన్‌కి తగినట్లు ప్రతీ అంశాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. టెక్నికల్ టీమ్‌తో పాటు ప్రధాన పాత్రల కోసం కూడా పరిశ్రమలోని టాప్ ఆర్టిస్టులనే ఎంచుకోవాలని చూస్తున్నారట. స్పిరిట్ షూటింగ్ ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మరి సందీప్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో హైలెట్ చేస్తాడో చూడాలి.