March 18, 202503:01:37 AM

Srikanth Odela: అప్పటివరకే నేను చిరు ఫ్యాన్స్‌.. ఆ తర్వాత.. శ్రీకాంత్‌ ఓదెల కామెంట్స్‌ వైరల్‌!

Srikanth Odela about Chiranjeevi project

చిరంజీవితో (Chiranjeevi)  శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela)  ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇది ఓ సీనియర్‌ స్టార్‌ హీరో – యంగ్‌ డైరెక్టర్‌ సినిమా అని అనేవారు. అయితే చిరంజీవికి శ్రీకాంత్‌ ఫ్యాన్‌ కావడంతో ‘ఫేవరెట్‌ హీరోతో.. అభిమాని సినిమా’ గా మారిపోయింది. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) ‘ఓజీ’ (OG Movie) సినిమాకు వచ్చిన క్రేజ్‌ దీనికీ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ ఓదెల ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Srikanth Odela

ఇంకా షూటింగ్ మొదలుకాక ముందే అభిమానుల్లో ఆసక్తికరేకెత్తిస్తున్న సినిమా చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల ప్రాజెక్ట్‌. దానికి కారణం సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో బయటకు వచ్చిన పోస్టరే కారణం. పూర్తిగా రక్తంతో నిండిన చేయి, దానికి పూసల తాళ్లు డిఫరెంట్‌గా పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. వయెలెన్స్‌ ఈ సినిమాకు కీలకమైన పాయింట్‌ అని కూడా చెప్పారు. చిరంజీవి ఇప్పటివరకు ఇలాంటి లుక్‌లో కనిపించలేదు అని కూడా అన్నారు.

ఈ నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సినిమా మీద ఇప్పటికే నిర్మాత సుధాకర్‌ చెరుకూరి (Sudhakar Cherukuri) ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మరో క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా ఎలా తెరకెక్కనుంది అనే విషయం కూడా చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్‌ లుక్‌లోనో, నయా లుక్‌లోనో కాదు.. లైవ్‌ లుక్‌లో కనిపిస్తాడు అని చెప్పారు. అంటే వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తాడు అని చెప్పారు.

48 గంటల్లో సినిమా స్క్రిప్ట్‌ను ఫైనల్ చేశామని, దాంతో కాసేపు మబ్బుల్లో తేలుతున్నట్టు అనిపించింది అని చెప్పారు. ఇందులో చిరంజీవి లుక్‌ ఫ్రెష్‌గా వయసుకు తగ్గ అవతారంలో ఉంటుంది అని చెప్పారు. మరి మీరు ఫ్యాన్‌ కదా సెట్స్‌లో ఎలా అని అడుగుతున్నారు కొందరు. చిరంజీవి క్యారవాన్ నుండి దిగేంతవరకే నేను చిరు ఫ్యాన్. ఆ తర్వాత నేను దర్శకుణ్ని, ఆయన హీరో అని చెప్పారు శ్రీకాంత్‌. ‘విశ్వంభర’ (Vishwambhara) తర్వాత అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) సినిమా చేశాక చిరంజీవి.. శ్రీకాంత్‌కి డేట్స్‌ ఇస్తారట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.