March 20, 202503:17:14 PM

Thaman: ఆడియన్స్ మాత్రమే కాదు నిర్మాతలు కూడా అదే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారట..!

Audience and Producers Request to Thaman Details Here (1)

తమన్ (S.S.Thaman)..టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అయినప్పటికీ తమిళ, హిందీ, కన్నడ సినిమాలకి కూడా పనిచేస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్. ఇప్పుడు తమన్ చాలా బిజీ. పెద్ద సినిమాలన్నిటికీ తమనే సంగీతం అందిస్తున్నాడు. ‘ది రాజా సాబ్’ (The Rajasaab) వంటి పాన్ ఇండియా సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తమన్ గురించి సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ కూడా అందరూ చూసే ఉంటారు. అతని సాంగ్ రిలీజ్ అయ్యింది అంటే చాలు..

Thaman

Music director Thaman responds on trolls

ట్రోలర్స్ వెంటనే అది కాపీ ట్యూన్ అంటూ ఏకి పారేస్తూ ఉంటారు. అది కాపీ అని తమన్ ఒప్పుకోడు. అలాంటి టైంలో అతను ‘పాత మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్పి వాళ్ళు కాపీ కొట్టలేదా?’ అన్నట్టు మాట్లాడతాడు. ఇటీవల ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)  సక్సెస్ మీట్లో తమన్.. ‘సోషల్ మీడియా వల్ల సినిమా కిల్ అయిపోతుంది.నాకు ఆఫర్లు వస్తాయా? లేదా? అనే భయం వేస్తుంది’ అంటూ మాట్లాడాడు. అంతకు ముందు ‘నన్ను ట్రోల్ చేసేది కేవలం ఒక్కడే’ అని అన్నాడు.

Chiranjeevi reaction on Thaman emotional speech

ఇక ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సక్సెస్ మీట్లో తమన్.. ‘మా సినిమా ఒరిజినల్ మ్యూజిక్ అడిగింది.. ఒరిజినల్ కలెక్షన్స్ అడిగింది.. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు’ అన్నట్టు మాట్లాడాడు. పరోక్షంగా ఆడియన్స్ ని రెచ్చగొట్టేది తమనే అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు తమన్ పాల్గొనే ఇంటర్వ్యూల్లో పెద్ద సినిమాల ఫలితాల గురించి ముందే ప్రెడిక్షన్స్ చెబుతుంటాడు.తర్వాత సినిమాలు ఆ రేంజ్లో ఉండవు. దీంతో తమన్ పై కొందరు మండిపడుతున్నారు.

‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా నుండి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా వరకు తమన్ వాటిని లేపిన విధానం అంతా ఇంతా కాదు అంటూ అభిప్రాయపడ్డారు. తర్వాత చూస్తే.. ఆ సినిమాలు అతను చెప్పిన స్థాయిలో లేవు. మ్యూజిక్ వరకు మాట్లాడి ఆపేయమని హీరోల అభిమానులు మాత్రమే కాదు, నిర్మాతలు కూడా తమన్ కి రిక్వెస్టులు పెట్టుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

మహేష్ బాబు సినిమాలో ఈ మార్పుని గమనించారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.