March 23, 202506:45:05 AM

Venkatesh: అక్కడ రూ.50 కోట్ల కొట్టింది.. ఇక్కడేం చేస్తుందో..!

Venkatesh Supports Vishal's Madha Gaja Raja Movie

సంక్రాంతి పండుగకి తెలుగులో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి ఆర్డర్ గురించి చెప్పాలి అంటే.. ఎక్కువ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాగా రాంచరణ్ (Ram Charan)  ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిలిచింది. తర్వాత బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) . వాటికే ఎక్కువ బిజినెస్ జరిగాయి. కానీ తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) . ఆర్డర్ ప్రకారం లీస్ట్ ప్రియారిటీ కలిగిన సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ సినిమానే.

Venkatesh

Hero Venkatesh Reacts On IT Raids

సో అందరి అంచనాలను తలకిందులు చేసినట్టు అయ్యింది. సరిగ్గా ఇలానే తమిళంలో ‘మద గజ రాజా’ అనే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. అజిత్ సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అక్కడ సరైన సినిమా లేకుండా పోయింది. ఇలాంటి టైంలో ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం ఆగిపోయిన విశాల్ (Vishal)  ‘మద గజ రాజా’ ని సంక్రాంతికి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ప్రేక్షకుల్లో మాత్రమే కాదు మేకర్స్ లో కూడా కలగలేదు.

Venkatesh Supports Vishal's Madha Gaja Raja Movie

ఏదో వదిలించుకోవాలి అన్నట్టు రిలీజ్ చేశారు. సుందర్ సి (Sundar C) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని జెమిని ఫిలిం సర్క్యూట్ వాళ్ళు నిర్మించారు.2012 లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సంతానం పారితోషికం విషయంలో కేసు వేయడం వల్ల ఆగిపోయింది. అయితే అనూహ్యంగా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రొట్ట కొట్టుడు కామెడీ, రొటీన్ స్టోరీ అని కొందరు విశ్లేషకులు విమర్శించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Vishal's 2012 Madha Gaja Raja movie becomes unexpected hit

అక్కడ హిట్ అవ్వడంతో తెలుగులో జనవరి 31న కూడా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి వెంకటేష్ (Venkatesh) సపోర్ట్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఎలా అంటే జనవరి 25న ‘మద గజ రాజా’ సినిమా ట్రైలర్ ను వెంకటేష్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారట. అది విషయం. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

విజయ్ ఆఖరి సినిమాకు మొదటి టైటిల్.. కొత్తగా ఉందే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.