March 3, 202503:06:35 AM

Venkatesh: వెంకటేష్ కూడా రెమ్యునరేషన్ పెంచే టైమొచ్చింది!

Will Venkatesh Hike His Remuneration After His Biggest Hit

సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టింది. వెంకటేష్  (Venkatesh Daggubati) మరోసారి తన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను అలరించి, కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించారు. రూ. 270 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా అతని మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఇప్పుడు వెంకటేష్ తన రెమ్యునరేషన్‌ను పెంచుతారా? అనే ప్రశ్న ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు వెంకటేష్ సినిమాలకు సుమారు రూ. 10-12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్.

Venkatesh

Hero Venkatesh Reacts On IT Raids

కానీ తాజా హిట్ దృష్ట్యా, ఇప్పుడు తన పారితోషికాన్ని డబుల్ చేసే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోగా కొనసాగాలంటే, సినిమాకు వచ్చిన ప్రాఫిట్‌ని బట్టి తన మార్కెట్‌ను ఓ లెవెల్ పెంచుకోవాలి. టాలీవుడ్‌లో ఇప్పుడు మిడ్ రేంజ్ స్టార్లు రూ. 25-30 కోట్ల వరకు తీసుకుంటుండగా, వెంకటేష్ కూడా అదే రేంజ్‌లోకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

4 directors ready for Venkatesh next film

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో “నేను పూర్తిగా వైట్ తీసుకుంటాను, బ్లాక్ అనే మాట నా లైఫ్‌లో లేదు” అని వెంకటేష్ చెప్పిన విషయం ట్రెండింగ్‌లో మారింది. ఇకపై పెద్ద సినిమా ఒప్పుకున్నా, రెమ్యునరేషన్ విషయంలో గట్టిగానే డీల్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మాస్ హిట్ తర్వాత నిర్మాతలు కూడా వెంకటేష్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో, అతని రెమ్యునరేషన్ పెరగడం ఖాయమనే టాక్ బలపడుతోంది.

Who is the Young Hero in Venkatesh's Sankranthiki Vasthunnam (3)

ప్రస్తుతం వెంకటేష్ నెక్స్ట్ సినిమా చర్చల దశలో ఉంది. ఏ దర్శకుడితో, ఏ బ్యానర్‌లో ఉంటుందన్నది స్పష్టత రాలేదు. కానీ ఈసారి, ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు వెంకటేష్ సినిమా బడ్జెట్‌లు 30-50 కోట్ల మధ్య ఉండేవి. కానీ సంక్రాంతికి వస్తున్నాం హిట్‌ను క్యాష్ చేసుకుంటే, 100 కోట్ల ప్రాజెక్ట్ కూడా ఓకే చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తే, రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

‘బింబిసార 2’.. ఇక పక్కన పెట్టేసినట్టేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.