2024 లో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే సినిమా వచ్చింది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్లాప్ టాక్ రావడంతో వెంటనే దుకాణం సర్దేసింది. రిలీజ్ కి ముందు ఈ సినిమా కొంచెం ఎక్కువగానే వార్తల్లో నిలిచింది. అందుకు కారణం.. ఈ సినిమాని నిర్మాత వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడం. ఎందుకంటే ఆయన రిలీజ్ చేసిన ‘క’ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. అందుకే ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ సినిమాలో వెన్నెల కిషోర్ హీరో అంటూ ప్రమోషన్ జరిగింది.
Vennela Kishore
కానీ అతను ప్రమోషన్స్ కి రాలేదు. ఇది మీమ్ పేజెస్ కి ఎక్కువ స్టఫ్ ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ప్రమోషన్ ఎగ్గొట్టడంపై వివరణ ఇచ్చాడు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. “నేను ఆ సినిమా ఇంటర్వ్యూలు చేశాను. ఓన్లీ ఈవెంట్స్ కి రాలేదు అంతే..! ఓపెన్ గా చెప్పాలంటే ఆ సినిమాలో నేను హీరో కాదు.ముందు నుండి నన్ను కమెడియన్ గా తీసుకున్నారు.
ఒక చిన్న ట్రాక్..లా అని చెప్పారు. ఆ సినిమా కథేంటో కూడా నాకు తెలీదు. 9,10 రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను. తర్వాత మెయిన్ పిల్లర్ అన్నారు. ఆ తర్వాత హీరో అన్నారు, మెయిన్ విలన్ అన్నారు. అది కూడా నాకు తెలీదు. ప్రమోషన్స్ గురించి నాకు ఏమీ తెలీదు. ఆ టైంలో నేను అమెరికాలో ఉన్నాను.ఈ మధ్యనే ఇండియా వచ్చాను. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. కావాలంటే మీరు నిర్మాత, డైరెక్టర్ ని అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు.
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ కాంట్రోవర్సీ పై స్పందించిన : వెన్నెల కిషోర్#VennelaKishore #SrikakulamSherlockholmes #BrahmaAnandam pic.twitter.com/7ZW6FHqidr
— Filmy Focus (@FilmyFocus) January 16, 2025