March 28, 202502:42:56 PM

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. చప్పుడు లేకుండా అన్నీ జరిగిపోతున్నాయిగా..!

Heroine Fixed For Allu Arjun, Atlee Movie

3 ఏళ్ళ పాటు ‘పుష్ప 2’ నే (Pushpa 2: The Rule) ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్ కి (Allu Arjun)  .. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే ‘పుష్ప 2’ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో (Trivikram) చేస్తున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ఇదే అని అంతా చెప్పుకున్నారు. సమ్మర్లో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనే టాక్ కూడా వినిపించింది. అయితే సీన్ మధ్యలోకి అట్లీ (Atlee Kumar)వచ్చి చేరాడు.

Allu Arjun, Atlee:

Heroine Fixed For Allu Arjun, Atlee Movie

అందుకు కారణం కూడా త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్న స్క్రిప్ట్ భారీ బడ్జెట్ తో కూడినది. మైథలాజి టచ్ కూడా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులకి ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్తే బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిపోతుంది. అందుకే త్రివిక్రమ్ ఇంకాస్త టైం తీసుకుని స్క్రిప్ట్ ను ప్రాపర్ గా డెవలప్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Heroine Fixed For Allu Arjun, Atlee Movie

దీంతో అట్లీతో అల్లు అర్జున్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీతో సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డిలే అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అన్నీ కుదిరినట్టు ఇన్సైడ్ టాక్. అల్లు అర్జున్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ కి అట్లీ రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘జవాన్’ తో (Jawan)  బాలీవుడ్ లో అతనొక వెయ్యి కోట్ల సినిమా ఇచ్చి మార్కెట్ తెచ్చుకున్నాడు.

అన్నీ ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ఇంకా రాలేదు. అయినప్పటికీ ఇందులో హీరోయిన్ కూడా ఫిక్స్ చేసేసినట్టు తెలుస్తుంది. అవును బన్నీ- అట్లీ సినిమా కోసం అప్పుడే జాన్వీ కపూర్ ని (Janhvi Kapoor) సంప్రదించడం.. ఆమె ఓకే చేసేయడం కూడా జరిగిందట. ‘దేవర’ తో (Devara) జాన్వీ తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఇప్పుడు రాంచరణ్ (Ram Charan) సినిమాలో కూడా నటిస్తుంది. హిందీలో ఆమె ఎలాగు పాపులర్. సో అల్లు అర్జున్ సరసన ఆమె మంచి ఆప్షన్ అనే చెప్పాలి. కానీ ఇవన్నీ ఫైనల్ అయ్యి అధికారిక ప్రకటన ఇస్తే బాగుంటుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.