March 17, 202506:03:47 PM

టైమ్‌కి సినిమా వేయకపోతే ఇంతే.. ఇలాగే అవుతుంది మరి!

court fined PVR for late

పీవీఆర్‌ (PVR) ఐనాక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు సినిమాకు ముందు, ఇంటర్వెల్‌లో వరుస యాడ్స్‌ వేస్తూ ఉంటారు. మామూలు థియేటర్లలో వెయ్యరు అని కాదు కానీ.. పీవీఆర్‌లో ఎక్కువ వేస్తుంటారు. ఈ సమయంలో చాలామంది ‘ఇదేం బాధరా బాబూ.. ఇన్ని యాడ్సా?’ అని అనుకుంటూ ఉంటారు. మాకు తెలిసి మీరు కూడా ఏదో సందర్భంలో ఇలా అనుకునే ఉంటారు. మనం ఆ సమయానికి అనుకొని వదలేస్తే ఓ వ్యక్తి ఏకంగా ఈ విషయంలో వినియోగదారుల కమిషన్‌ మెట్లెక్కారు. ఇప్పుడు ఆ కేసు విషయంలో తీర్పు వచ్చింది.

PVR

court fined PVR for late

తన సమయాన్ని వృథా చేశారంటూ పీవీఆర్‌ ఐనాక్స్‌, బుక్‌మై షో టికెట్‌ బుకింగ్‌ సర్వీసుపై ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం వినియోగదారుల కమిషన్‌లో దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్‌.. ఈ కేసులో దావా వేసిన వ్యక్తికి నష్టపరిహారం కింద రూ.65వేలు ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. అలాగే ఈ విషయంలో పీవీఆర్‌ ఐనాక్స్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 2023లో ఈ విషయంపై ఆ వ్యక్తి కమిషన్‌ను ఆశ్రయించారు.

PVR Inox Scripting New Theatre Billing (1)

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 2023లో ఓ రోజు సాయంత్రం 4 గంటల షోకు పీవీఆర్‌ ఐనాక్స్‌లో సినిమాకు వెళ్లారు. అయితే సినిమా ప్రారంభించడానికి ముందు అరగంట సేపు యాడ్స్‌, ట్రైలర్లు ప్రసారం చేశారు. దీంతో 25 నిమిషాల సమయం వృథా అయిందని ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌కి ఇచ్చిన దావాలో పేర్కొన్నారు. ఆ ప్రకటనల వల్ల సినిమా అరగంట ఆలస్యంగా ప్రారంభమైందని, దీంతో సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన షో 6.30కి ముగిసిందని రాసుకొచ్చారు.

షో ఆలస్యం కారణంగా తన ప్లానింగ్‌ అంతా తారుమారు అయిందని, షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆ ప్రకటనల వల్ల ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ విషయమై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్‌ సమయాన్ని డబ్బుగా పరిగణించాలని తీర్పులో పేర్కొంది. బుక్‌ మై షో టికెట్‌ కేవలం బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ కాబట్టి సమయంపై దానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపింది. పీవీఆర్‌కు మాత్రమే జరిమానా పడింది.

హిట్ 3: ఆ హీరోను కూడా దింపుతున్నారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.